కలప దుంగలు పట్టివేత
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో టేకు కర్ర దొంగ రావాన విచ్చల విడిగా సాగుతుంది గతములో ఎన్నో సార్లు బొగ్గు లారీల పై , వ్యాన్ లలో , సుమోలలో అక్రమంగా రవాణా చేస్తుండగా అటవీ శాఖాధి కారులు పట్టుకొని సీజ్ చేశారు , కానీ దొంగ రవాణా మాత్రం ఆగుతలేదని, . అటవీ అధికారుల కను సన్నలలో దొంగ కలప అక్రమ రావాన సాగుతున్నట్లు మండల వాసులు అంటున్నారు ఆదివారం రాత్రి దుర్గాపూర్ నుంచి గోలేటి వైపు వెళ్తున్న ఆటో నంబర్ ఎ పీ 15 వి 6800 గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను. ఎఫ్ అర్ వో వినయ్ కుమార్ బాబు అందించిన సమాచారముతో డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ పకడ్బందిగా ఉపాయముతో పట్టు కున్నారు. 2 టేకు దుంగలు , వాటి విలువ 4576 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. అదిలా ఉండగా గోలేటి రోడ్ వెంట ఆయన సిబ్బందితో వెతకగా టేకు దుంగలు 30 దొరికాయని అన్నారు. బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్ . మహ్మాద్ సిబ్బంది పాల్గొన్నారు .
No comments:
Post a Comment