వార్షిక లక్ష్యాన్ని అదిగా మించిన బెల్లం పల్లి ఏరియ - జి ఎం రవిశంకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); బెల్లం పల్లి ఏరియ లోని గనులు వార్షిక లక్ష్యాన్ని అదిగ మించి కొత్త రికార్డు ను సృష్టించినదని బెల్లం పల్లి ఏరియ జెనరల్ మేనేజర్ కె రవిశంకర్ అన్నారు . గోలేటి లోని జి ఎం కార్యాలయములో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశములో శుక్ర వారము ఆయన మాట్లాడారు .బెల్లం పల్లి ఏరియాలో 65 లక్షల టన్నులు సాదించి ముందంజలో ఉందని ఆయన తెలిపారు .కార్మికులకు రక్షణకల్పిస్తూ , సంక్షేమ బాటలో నడిపిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి సాదిస్తూ వస్తున్నాడని ఆయన పేర్కొన్నారు . దీనికి కార్మికులు , అధికార్లు కృషి ఎంతో ఉన్నదని అన్నారు . వచ్చే ఎదాడి 6. 1 లక్షల టార్గెట్ ఉన్నదని తెలిపారు . దానిని అధిగ మించడానికి అందరి సహాకారము అవసరమని అన్నారు . బెల్లం పల్లి ఓపెన్ కాస్ట్ కు అన్ని అనుమతులు వచ్చాయని , భూ నిర్వాశితులకు నష్టపరిహారము ఇచ్చిన తరువాతే పనులు మొదలు పెడదామని ఆయన అన్నారు . సింగరేణి లాభాలలో ఉందని అంటే దానికి కారణం కార్మిక సంగ నాయకులు , కార్మికులే కారణమని తెలిపారు . ఈ రోజు సింగరేణి పండగ వాతావరణములో మిఠాయిలు పంచు కుంటుంది అంటే అందరి కృషి తో సింగరేణి లో 2 వ స్థానములో నిలిచిందని ,ముఖ్య మంత్రి చంద్ర శేకర్ రావు ధన్య వాదాలు తెలిపి నట్లు జి ఎం పేర్కొన్నారు . కంపని నిర్దేశించిన లక్ష్యాలను అదిగా మించి నదని రాబోయే సంవత్సరములో ఈ ఏరియా మొదటి స్థానములో నిలవాలని , దానికి అందరు సహకరించాలని అన్నారు . ఈ కార్య క్రమములో బెల్లం పల్లి ఏరియా డి జి ఎం సివిల్ రామ కృష్ణ , పి ఎం సీతా రామ్ , డిప్యూటి పి ఎం రాజేశ్వర్ లతో పాటు ఇతర అధికార్లు ఉన్నారు .
No comments:
Post a Comment