Monday, 18 April 2016

గోలేటి లో న్యాయ విజ్ఞాన సదస్సు

గోలేటి లో న్యాయ విజ్ఞాన  సదస్సు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ని గోలేటి లో న్యాయ సేవా సమితి ఆధ్వర్యములో న్యాయ విజ్ఞాన సదస్సును సోమ వారము నిర్వహించారు .గోలేతిలోని ఆఫీసర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సదస్సులో   ఆసిఫాబాద్ సివిల్ జడ్జి ఎన్ హేమ లతా  పాల్గొని మాట్లాడారు .చట్టం  ఎవరికి చుట్టము కాదని,చట్టం దృష్టిలో న్యాయం అందరికి సమానమేనని అన్నారు.  మారుతున్న కాలానికి పరిస్థిలకు అనుగుణంగా   చట్టాలపై మార్పులు వస్తున్నాయని ఆమె అన్నారు . వైట్ కాలర్ నేరాలు జరుగుతున్నాయని ప్రజలు అపరమత్తంగా ఉండాలని అన్నారు . ఈ సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు సమ చార హక్కు చట్టం , గృహ హింస బాల్య వివాహాలు తడితార అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్య క్రమములో బెల్లం పల్లి జి ఎం రవిశంకర్ , న్యాయ వాదులు సురేష్ , సతీష్ బాబు ఎన్ రవీందర్ , రాజేష్ , నరహరి , కార్మిక సంఘ నాయకులు సదాశివ్ , ఎస్ తిరుపతి డిప్యూటి పి  ఎం రాజేశ్వర్ లు ఉన్నారు .  

No comments:

Post a Comment