ఘనముగా మహాత్మ జ్యోతిబా ఫూలే 190వ జయంతి వేడుకలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) భారతమాత ముద్దబిడ్డ, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మజ్యోతిబాఫూలే అని ఆయన చేసిన సేవలు చిరస్మరణీమని రెబ్బెన ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ అన్నారు. సోమవారం రెబ్బెన అతిధి గృహంలో మహాత్మ జ్యోతిబా ఫూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పిస్తూ, నిరుపేద బడుగుబనహీన వర్గాల కోసం జీవితమంతా ఒంటిరిగా పోరాడిన మహావ్యక్తి ఫూలే అని కొనియాడారు. .ఈ కార్యాలయములో టి ఆర్ ఎస్ జిల్లా ఉపాధ్యాక్షుడు నవీన్ జైస్వాల్ కుమార్ , బి సి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ , ఎం పి పి సంజీవ్ కుమార్ , తది తరులు ఉన్నారు.
No comments:
Post a Comment