ఘనముగా చండ్ర రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లోని కె . ల్ మహేంద్ర భవన్ లో శనివారం రోజున చండ్ర రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి అఖిల భారత యువజన సమాఖ్య ఎ ఐ వై ఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎ ఐ స్ ఫ్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్బముగా ఎ ఐ వై ఫ్ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ , ఎ ఐ స్ ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వర్ రావు భారత కమ్యునిస్టు పార్టీ కి ఎనలేని సేవలు చేశారు ముఖ్యముగా బడుగు బలహీన వర్గాల అబ్యునతి కోసం పేద ప్రజల హక్కుల కోసం,ఎన్నో పోరాటాలు చేశారు 1959 మే , 31 న ఎ ఐ వై ఫ్ ని అవిర్బవించాడని నాటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు అందరు యువతి యువకులు విద్యార్థులు చండ్ర రాజేశ్వర్ రావు ఆశయాలకు అనుగుణముగా ఉద్యమాలు చేశారని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎ ఐ వై ఫ్ మండల ఉపాధ్యక్షుడు మలిశెట్టి మహిపాల్ , పారిపండ్ల రమేష్ , దుంపల బాపు , చంద్రయ్య , రవి , తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment