సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు-ఎ ఒ మంజుల
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రైతులు వ్యవసాయ ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటించి, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వ్యవసాయం చేసి అదిక దిగుబడి సాదించాలని మండల వ్యవసాయాధికారిణి మంజుల అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని తుంగేడ గ్రామాల్లో మన తెలంగాన-మన వ్యవసాయం అవగాహన సదస్సులో మంజుల మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకోని పంటలను పండిస్తూ అధిక దిగుబడులను సాధించాలని, పాడిపశువుల పెంపకం చేపట్టి ఆర్థికంగా ప్రగతి పథంలోకి సాధించాలని కోరారు. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోరకు సబ్సిడీపై అందించే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట వేస్తూ నష్టపోతున్నందున రైతుల దృష్టిని సాంప్రదాయ పంటలవైపు మళ్లించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నందున జిల్లాలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పత్తిపంట వేయకుండా వారిని చైతన్యపర్చేందుకు మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయాదికారులు ఊరురా రైతులను చైతన్యపరుస్తున్నారు. పత్తి విస్తీర్ణం తగ్గించడం ద్వారా ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వస్తాయని, రసాయన ఎరువులను వాడితే బుసారం దెబ్బతిని దిగుబడులు తక్కువకు కారణం అవుతాయి అని అన్నారు. ఈ సదస్సులో పశువైద్య అధికారి సాగర్, సర్పంచ్ లక్ష్మి భాయి, ఉప సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment