మంజురైన రుణాల యూనిట్లను పెంచాలి-- కో ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ మైనారిటి యువకులకు చేయూత నివ్వాలని మంజూరు చేసినా అవి సరిపోవడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్సి పురాణం సతీష్ కి మరియు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి కో-ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని బుధవారం నాడు ఏమ్పిడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రెబ్బెన మండలం గోలేటికి 1 యూనిట్, రెబ్బెన తెలంగాణా గ్రామీణ బ్యాంకు కు 1 యూనిట్ మొత్తం 2 యూనిట్లు మంజూరు చేశారని వాటి కోసం మండలంలోని 20 మంది మైనార్టీ నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. అవి రెబ్బెన మండలానికి సరిపోవని 5 యూనిట్ల వరకు పెంచాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో సయ్యద్ ఇమ్రోజ్ అలీ, హబీబ్, ఆరిఫ్ అలీ, అన్సారి మైనార్టీ నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment