వడ దెబ్బకి ఉపాధ్యాయుడి మృతి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని గంగాపూర్ ఉన్నత పాటశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మద్యల నర్సయ్య (50 ) వడ దెబ్బతో శని వారము మృతి చెందాడు . శుక్ర వారము ఎండకు ఎక్కువగా తిరిగాడని రాత్రి నుండే అస్వస్థకు గురి అయ్యాడని భార్య తెలిపింది . మృతుడి స్వస్థలం కడెం మండలం లోని మున్యాల గ్రామము . మ్రుతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . దాహన కర్చుల నిమితము 20 వేల రూపాయలు ఆ పాటశాల ప్రధానోపాధ్యాయుడు వామన మూర్తి తక్షణమే అందజేశారు . మృతుడిని స్వస్థలానికి తీసికెళ్లారు .ఈ సంఘటన స్థలాన్ని ఎం పి పి సంజీవ్ కుమార్ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి సందర్శించారు. . ఈ కార్య క్రమములో పి ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్షడు బత్తుల సదానందం , అధ్యక్షా కార్య దర్షులు ఖాదర్ , రవి , ఉపాధ్యాయులు ఉన్నారు.
No comments:
Post a Comment