ప్రమాదంలో ప్రజలు - పట్టించుకోని విద్యుతు అధికారులు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని గొల్లగూడెం గ్రామంలో దారికి అడ్డంగా ట్రాన్స్ ఫారముతో కూడిన విద్యుత్ స్తంభము వైర్లు కిందకు వేలాడుతూ వున్నాయి. ఆ విద్యుత్ కరెంట్ తీగల వల్ల పశువులు, చిన్న పిల్లలు అ దారికి వెళ్ళేటపుడు ఎప్పుడు ఎ ప్రమాదము ముంచుకొస్తుందో నని ప్రజలు భయా భ్రాన్తులకు గురి అవుతున్నారు. కరెంట్ ట్రాన్స్ ఫారముతో కూడిన విద్యుత్ స్తంభము వైర్లు కిందకి వేలాడుతున్నాయని, చిన్న పిల్లలకు సైతం అందేలా వున్నయిని ప్రజలు భయపడుతున్నారు . విద్యుత్ అధికారులతో మొరపెట్టుకున్న పట్టించుకోవడము లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇటివల కాలంలో విద్యుతు వైర్ల వలన చాలా ప్రమాదాలు జరిగాయి కాని ఇది అధికార్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనబడుతున్నదని గ్రామ వాసులు అంటున్నారు . ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని , విద్యుతు స్తంభం వైర్లు వేలాడ కుండా చేయాలనీ, స్తంభం చుట్టూ కంచె వేయాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment