Wednesday, 27 April 2016

గుర్తు తెలియని వాహానం డీకొని 16 గొర్రెలు మృతి 2గాయాలు

గుర్తు తెలియని వాహానం డీకొని 16 గొర్రెలు మృతి 2గాయాలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని నక్కల గూడా సమీపములో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహానం డీకొని  16 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 2 గొర్రెలకు తీవ్ర గాయాలయాయి . రాజయ్య గొర్ల కాపరి తెలిపిన వివరాల ప్రకారము మంగళ వారము రాత్రి నక్కల గూడా జాతీయ రహదారిపై గొర్ల మందను దాటిస్తుండగా మామిడిపళ్ళ లోడుతో ఉన్న ట్రాలీ అతివేగంగా వచిందని,  చేతి ఊపిన ఆపకుండా గోర్లపై నుండి దూసుకేల్లిందని , కళ్ళెదుటే ఈ దారుణం జరిగిందని తట్టుకోలేక పోయానని కన్నీరు మున్నీరు అవుతూ తెలిపారు. ఒక్కొక్క గొర్రె విలువ 8000 వేల రూపాయల నుండి 9000 ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు . మొత్తం మృతి చెందినా గొర్ల విలువ 150000 రూపాయలవరకు  ఉంటుందని అన్నారు . ఈ గొర్రెలు రెచిని ఎగ్గే మల్లయ్య కు చెందినవని తెలిపారు .

No comments:

Post a Comment