సాయి విద్యాలయంలో విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం సోమవారం రోజున సాయి విద్యాలయంలో విజ్ఞాన ప్రదర్శన సైన్సు కార్యక్రమం కరస్పండేంట్ సంజీవ్ కుమార్ అద్వర్యంలో గణనియముగా జరిగింది. ముఖ్య అతిధి గాఎం పి పి కార్నాతం సంజీవ్ కుమార్ పాల్గొనగా యం ఈ ఓ వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహించారు . సైన్సు విజ్ఞాన సదస్సులో విద్యార్థులు మనవ శరీరంలో వివిధ బాగాలు మూత్రపిండాలు గురించి నాడివ్యవస్త మరియు మెదడు గురించి వివరించారు అదేవిదముగా వాతావరణ కాలుష్యం ,నీటి కాలుష్యం గురించి భ్హూగర్భ గనుల నుంచి బొగ్గు తీయడం గురించి ,పల్లెటూర్ లో స్వచ్చ భారత్ గురించి,కాలుష్యాల వల్ల వచ్చే వ్యాదుల గురించి వివరించారు. అదేవిదముగా అటవీ శాఖలో చెట్లను పెంచడం అడవిలో వుండే జంతువులు గురించి వివరించారు. ఈ సదస్సులో ఎమ్ పి పి సంజీవ్ కుమార్,ఎమ్ ర్ ఓ రమేష్ గౌడ్ సదస్సు ను పరిశీలించి విద్యార్థులు వెల్లడించిన విజ్ఞాన ప్రయోగాల గురించి కరస్పండే డ్ సంజీవ్ కుమార్ని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్ డివిజనల్ గౌరవ అధ్యక్షుడు లక్ష్మన్ చారి, సర్పంచ్ వెంకటమ్మ, టి ర్ స్ తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ ,టి ర్ స్ మహిళ ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, ఎమ్ పి టి సి వనజ, టిడిపి మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఎ.పి.మ్ లు వెంకటరమణ,రాజుకుమార్,చిరంజీవి,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
No comments:
Post a Comment