కాంట్రాక్టు కార్మికుల హై పవర్ కమిటి వేతనాలకు ఎ ఐ టి యు సి కృషి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటి వేతనాలు చెల్లించాలని బుధవారం రోజున సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి. బానుదాస్ డిమాండ్ చేసారు ఇటివల జరిగిన ఎ ఐ టి యు సి జాతీయ మహాసభలలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని మరియు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై తీర్మానం చేయడం జరిగిందని గత 10సం ; నుండి కాంట్రాక్టు కార్మికులు సింగరేణి యజామన్యం చేతిలో దోపిడీ గురి శ్రమ దోపిడీ గురి అవుతున్నారని రాబోయే రోజులలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఎ ఐ టి యు సి ఎనలేని పోరాటాలు చేస్తుందని భవిష్యత్ లో కాంట్రాక్టర్ మరీనా కార్మికులను మర్చరాదని డిమాండ్ చేసారు మార్చ 29న జరగబోయే సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు లో పాల్గొని విజయవంతం చేయాలనీ అన్నారు ఈ సమావేశంలో ఎ ఐ టి యు సి బ్రాంచి కార్యదర్శి ఎస్ .తిరుపతి ,ఎస్ సి డబ్ల్యు యు బ్రాంచి ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ ,ఎ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి ఎస్.సంతోష్ ,నాయకులూ రమేష్ పాల్గొన్నారు
No comments:
Post a Comment