Thursday, 24 March 2016

విరిగిన విద్యుత్ స్తంభం -భయము గుప్పిట్లో ప్రజలు

విరిగిన విద్యుత్ స్తంభం -భయము గుప్పిట్లో ప్రజలు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామం గుడి దగ్గర  ట్రాన్స్ ఫరముథొ కూడిన విద్యుత్ స్తంభము విరిగిపోయి ఉన్నది . ఆ విద్యుత్ స్తంభము ఎప్పుడు విరిగి పోతుందో , ఎప్పుడు ఎ ప్రమాదము ముంచుకొస్తుందో నని ప్రజలు భయా భ్రాన్తులకు గురి అవుతున్నారు . మంగళ వారం సాయంత్రము  ఇందిరా నగర్ లో  గల బెల్లపు ఒర్రె దగ్గర విద్యుత్ అధికారుల నిర్లక్షం తో నిండు ప్రాణం విద్యుతఘతానికి బలైపోయింది.  ఆసిఫాబాద్ బూరుగూడ  నుండి  గొర్ల మందను రెబ్బెన వైపుకు తీసుకువస్తున్న  గొర్ల కాపరి కొండ పర్వతలు (45) సుమారు సాయంత్రం విద్యుతఘతానికి గురై మృతి చెందాడు. మృతుడు తాండూరు మండలం లోని  కాసిపేట కు చెందినవాడిగా బందువులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం మృతుడు కర్ణం బీరయ్య కు కులికి వచ్చాడని వాళ్ళు చెప్పారు.  గత పదిహేను రోజుల క్రితం వీచిన గాలి వానకి  విద్యుత్ తీగలు వ్రేలాడుతున్నట్లు స్తానికులు, రైతులు  వివరించారు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా వుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.గత 9 నెలల క్రితం సింగల్ గూడకు చెంది వృద్దురాలు విద్యుత్ కు ప్రాణాలు కోల్పోయిన సంగత న మరవక ముందే ఈ దారుణం జరిగింది .  ఈ విధుత్ స్తంభము విరిగిన , కరెంట్ తీగలు భూమి మీద ఉయాలలూగిన విధుత్ అధికార్లు పట్టించుకోవడము లేదనే ఆరోపణలు ఉన్నాయి . ఇది అధికార్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనబడుతున్నాడని మండల వాసులు అంటున్నారు . 

No comments:

Post a Comment