మహిళల భాధ్రతతోనే బంగారు తెలంగాణా - జెడ్ పి టి సి బాబురావు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన అదితి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యములో వేడుకలను మంగళ వారము ఘనంగా నిర్వహిచారు. ఈ సందర్భంగా రెబ్బెన జెడ్ పి టి సి అజ్మీర బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు .. ఆయన మాట్లాడుతూ. మహిళలు విద్యా , రాజకీయంగా ఎదగాలని , మహిళా దినోస్త్స్వాలు ఎన్నో జరుగు తున్న అత్యాచారాలు , గృహ హింస ను అరికట్టలేక పోతున్నామని అన్నారు . . మహిళల భద్రతతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. కే సి ర్ ప్రభుత్వం స్త్రీలకోసం ప్రత్యేకముగా సమాజముల్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు చట్ట సభల్లో ప్రతిపాదనలు అమలుచేయాలని, మహిళలు ఆత్మసైర్థంతో ముందుకు నడవాలని సూచించారు. తే దే పా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి మాట్లాడుతూ నేడు మహిళలు చట్టాల విషయంలో కొంత వెనుకబడి ఉన్నారని చట్టాల అమలు చేయడానికి మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హింసకే ప్రోత్సహిస్తున్నాయని రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, బ్రూణహత్యలు పెరుగుతున్నాయే తప్ప వాటినుంచి మహిళలను రక్షించడంలో చట్టాలు విఫలమయ్యాయని అన్నారు అనంతరం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు. సాంస్కృతిక కార్యక్ రమాలు అందరినీ అలరించాయి. మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో,మండల పరిషద్ ఉపాద్యక్షురాలు రేణుక ,ఎం ఇ ఓ వెంకటేశ్వర స్వామీ , ఎం పి డి ఓ ఎం ఎ అలీమ్ , ఎహ్ ఎం లు సుమలత , స్వర్ణ లతా , టి ఆర్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదశి కె శంకరమ్మ , పలు గ్రామాల సర్పచులు సులోచన ,లక్ష్మిబాయి, లక్ష్మి ,ఆర్గనైజింగ్ కార్య దర్షులు లక్ష్మ చారి , ప్రసాద్, కన్వినర్ బి గోపాల కృష్ణ , ఎం పి టి సి లు వనజ,మల్లేశ్వరి , సువర్ణ ,సుజాత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment