Thursday, 31 March 2016

తెలుగుదేశం పార్టీ 34 వ ఆవిర్బావదినోత్సవ వేడుకలు

    తెలుగుదేశం పార్టీ  34 వ ఆవిర్బావదినోత్సవ  వేడుకలు     

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం నాడు రెబ్బెన మండల కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో ఎన్ టి అర్ విగ్రహానికి  పూల మాల వేసి 34 వ ఆవిర్బావ దినోత్సవాన్ని రెబ్బెన  మండల ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్  అధ్వర్యంలో ఘనముగా నిర్వహించారు  . ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం లో ఏర్పాటు  చేసిన సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు  సొల్లు లక్ష్మి మాట్లాడుతూ టి అర్ స్ ప్రభుత్వం మంచి నీళ్ళు ఇవ్వకుండా ,విది విదినా  బెల్టు షాప్  లు పెట్టి దానిపై వచ్చే సొమ్ము చేకుర్చుకుంటుంది అని,  బడుగు బలహీన వర్గాల పేదలకు  3 ఎకరాల భూమి ఎ మాత్రం ఇవ్వకుండా, డబుల్ బెడ్ రూం ఇల్లు మండలంలో  40 మాత్రమే వచ్చాయని అని వాటిలో అవకతవకలు జరగకుండా పేదలకు ఇవ్వాలని   డ్వాక్ర మహిళల  ఋణం మాఫీ చేయాలనీ ,అన్నారు . ఈ కార్యక్రమంలో  మండల  ఉపాధ్యక్షులు సంగం  శ్రీను, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్,లూ కోత్వాల శ్రీనివాస్, ఎర్రం మహేష్,చందా నాగరాజు, ఆత్మకూరి నరేష్ లు  మరియు  పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు  

No comments:

Post a Comment