గిరిజన యునివర్సిటిపై అసెంబ్లీ లో స్పందించని మంత్రులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): జిల్లాలో గిరిజన యునివర్సిటిపై జిల్లా ఎం ల్ ఎ ,ఎం పి ,ఎమ్ ల్ సి ,మంత్రులు స్పష్టత ఇవ్వాలని ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు రెబ్బెన మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కొమురం భీం వర్ధంతి 9 అక్టోబర్ 2014 సం.. గిరిజన దర్భార్ లో వెలది ప్రజలతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయానికి కొమరం భీం పేరు పెడుతూ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆదిలాబాద్ జిల్లా లో ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కే సి ఆర్ హామీ ఇచ్చారు కానీ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూర్ లో ఏర్పాటు చేయకుండా వరంగల్ కు తరలిస్తున్నారని దీనిని తీవ్రముగా కండి స్తున్నామని అన్నారు అక్షారస్యతలో వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్, అలంటి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు ఎం ల్ ఎ ,ఎం పి ,ఎమ్ ల్ సి స్పందిచక పోవడం సిగ్గు చేటు అన్నారు అసెంబ్లీ సమావేశాలలో గిరిజన యునివర్సిటిపై చర్చ రక పోవడం దారుణము అన్నారు ఇప్పటికీ అయిన అసెంబ్లీ సమావేశాలో చర్చించి ఉట్నూర్ లో ఏర్పాటు చేయాలనీ అన్నారు లేని పక్షం లో అసెంబ్లీ సమావేశాలు మిగియక ముందే చలో హైదరబాద్ కార్యక్రమం చేపడతామని, అప్పటికి స్పందిచక పోతే ఇంద్ర పార్కు ముందు ధర్నా నిర్విస్తామని, అప్పటికి స్పందించక పోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని,దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు ఉద్యమాన్ని దశలవారీగా ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ మండల అధ్యక్షుడు కస్తూరి రవి, బోగే ఉపేందర్, ప్రదీప్, మహిపాల్ , తిరుపతి ,పుదరి సాయి కిరణ్ మరియు పలువురు విద్యార్ధి సంఘ నాయకులు పలుగున్నారు
No comments:
Post a Comment