Tuesday, 29 March 2016

విచ్చల విడిగా సిమ్ లు అమ్మితే కఠిన చర్యలు - సి ఐ కరుణాకర్

విచ్చల విడిగా  సిమ్ లు అమ్మితే కఠిన చర్యలు - సి ఐ  కరుణాకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ద్రువికరణపత్రాలు సరిచూసిన తర్వాతే  సిమ్ లు అమ్మాలని,అలా కాకుండా దానికి విరుద్దంగా రోడ్లపై   గొడుగులు పెట్టి   విచ్చల విడిగా  అక్రమముగా సిమ్ లు అమ్మితే చట్ట రిత్య  కటిన చర్యలు తీసుకుంటామని తాండూర్ సి ఐ  కరుణాకర్ అన్నారు మంగళవారం సి ఐ కార్యాలయంలో   రిటైలర్ల  సమావేశం లో ఆయన మాట్లాడుతూ  సెల్ ఫోన్ వినియోగదారులకు కొత్తగా సిమ్ కార్డు జరిచేసేటపుడు ద్రువికరణ పత్రాలు వచ్చిన వ్యక్తి ఫోటో ఒర్జినల్ సరిచుసికొని వినియోగదారుని సంతకాలు తీసుకోని జరిచేయాలని అన్నారు . ద్రువికరణ పత్రాలు లేకుండా కొత్త వ్యక్తులు అనుమనవస్పదముగ ఆగిపించిన వారిని  దగ్గర వున్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనీ అన్నారు  ఈ సమజంలో ఎ   నేరం జరిగినా నేర పరిశోధన సిమ్ కార్డు నుంచి మొదలు అవుతుంది అవే  సిమ్  కార్డు లు విచ్చల విడిగా అమ్మడం వల్ల నేరం మరో కోణంలో వెళ్లి అసలైన నేరస్తులు తప్పించుకునే అవకాశాలు వున్నాయి అలాటప్పుడు సిమ్ కార్డు జారి చేసిన  రిటైలర్  కానీ  డిస్టుబుటర్  వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి పోర్జరీ,మరియు వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేస్తామని అన్నారు.  అందుచేత   తగు జాగ్రతలతో సిమ్ కార్డు అమ్మాలని సూచించారు .  ఈ కార్యక్రమంలో  రిటైలర్ల మండల  సంఘం అద్యక్షుడు సునీల్ కుమార్ , ఉపాధ్యక్షులు కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మల్లేష్, రెబ్బెన ఐడియా డిస్టుబుటర్ లోకేష్ నాయుడు , ఎయిర్ టెల్ డిస్టుబుటర్ ఎమ్ . సతీష్ గౌడ్, ,వొడాఫోన్ డిస్టుబుటర్  అనిల్, గోలేటి ఐడియా డిస్టుబుటర్   మొఈస్, శంకర్,సాయి, మహేష్,  ముడెడ్ల రాజేందర్ మరియు  ఐడియా ఆఫీస్ ఇంచార్జి బి.రాజుకుమార్ గౌడ్ మరియు  రిటైలర్ లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment