తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కాని అగ్ర కులాల వాళ్ళ చేతుల్లో రాజ్యం -
బి సి. ఐక్య సఘర్షణ సమితి జాతీయ అద్యక్షుడు వి జి అర్ నారగోని
(రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కాని ఇప్పటికి రాష్ట్రము అగ్ర కులాల వాళ్ళ చేతుల్లోనే మగ్గుతుందని బి సి. ఐక్య సఘర్షణ సమితి జాతీయ అద్యక్షుడు వి జి అర్ నారగోని అన్నారు. బిసి ఐక్య సఘర్షణ సమితి ఆధ్యర్యంలో ఎస్ సి , ఎస్ టి , బి సి , మైనారిటి రాజ్యాధికార చైతన్య సదస్సు రెబ్బన అతిధి గృహంలో సోమవారం నిర్వహించటం జరిగింది. ప్రధాన రహాదారి గుండా భారి ర్యాలి నిర్వహించారు . అనతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు . బిసి కులాల ఐక్యా సంఘర్షణ సమితి జిల్లా అద్యక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ అద్యక్షతన జరిగిన సభలో ముక్య అదితి గా విచ్చేసిన బి సి. ఐక్య సఘర్షణ సమితి జాతీయ అద్యక్షుడు వి జి అర్ నారగోని మాట్లాడుతూ అన్ని బడుగు బలహీన వర్గాల త్యాగాల ఫలితం గా తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కాని ఇప్పటికి రాష్ట్రము అగ్ర కులాల వాళ్ళ చేతుల్లోనే మగ్గుతుందని అన్నారు. చట్టసభల్లో అవకాశాలు కల్పించాలాని , బి సి లకు రిజర్వేశండ్లు కల్పించాకపోవడంతో చాల వెనుకబడి పోయారని వారు పెర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేశన్లు అమలు చేయక పోవడమే కారణమని తెలిపారు. బి సి వారికి ఉద్యోగాల్లో ప్రమోశండ్లు కల్పిచాలని అన్నారు. వెనుకబడిన బి సి విద్యార్థులకు స్కాలర్ షిప్పులు విడుదల చేయాలి అన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా బి సి కులాలు సమస్యలు ఎదుర్కోటు న్నారని ముఖ్యంగా రాష్ట్రంలో బి సి కులాల వారు పేదరికంలోఉన్నారని బి సి వారందరికీ కళ్యాణ లక్ష్మి పధకం అమలు చేయాలనీ, 3 ఎకరాలు భుమియియ్యాలి డిమాండ్ చేశారు . ఈ కార్య క్రమంలో బిసి కులాల ఐక్యా సంఘర్షణ సమితి తెలంగాణా రాష్ట్ర అద్యక్షుడు పెద్దంపేట. శంకర్, విధాన నిర్ణయ కమిటి విస్ చైర్మన్ మేకల మల్లేశం, రాష్ట్ర్ర నాయకులు బి సి ఐక్య సంఘర్షణ సమితి కదతల మల్లయ్య , జిల్లా కార్యదర్శి పులబోయిన మొండయ్య , జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి కొవ్వూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రమేష్ ఎం పి పి సంజీవ్ కుమార్, జెడ్పి టిసి బాబురావు, జిల్లా జిల్లా మహిళా అద్యకురాలు కుందారపు శంకరమ్మ, తూర్పు జిల్లా అద్యక్షుడు నవీన్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment