10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) సామవారం రోజు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి వేకటేశ్వర స్వామి తెలిపారు.మండల కేంద్రములో 2 పరీక్షా కేంద్రాలు ఒకటి గంగాపూర్ ఉన్నత పాతశాల , రెండవది రెబ్బెన ప్రభుత్వ పాటశాల లో ఉన్నాయని అన్నారు . గంగాపూర్ పరీక్షా కేంద్రములో 167 మంది , రెబ్బెన పరీక్షా కేంద్రములో 221 మంది విద్యార్థులు పరిక్షలు రాస్తున్నారని తెలిపారు . రెబ్బెన చీప్ సుపరెడేంట్ సాంబ మూర్తి డి.ఓ గా ఆర్ కె ప్రసాద్ , గంగాపూర్ లో చీప్ సుపరెడేంట్ ఎస్ రాము , డి ఓ గా మొగిలి , మురళి లు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు . పరీక్షా కేంద్రాలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు . అరగంట ముందే పరీక్షా కేంద్రాని రావాలని విద్యార్థులకు సూచించారు . ఈపరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అరంగటకుముందే రావాలని సూచించారు
No comments:
Post a Comment