మహిళా దినోత్సవం రెబ్బన లో ఘనంగా
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెబ్బెన అదితి గృహంలో ఆదివారం వేడుకల ఘనంగా నిర్వహిచారు ఈ సందర్భంగా జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ ఆద్వర్యంలో మహిళా దినోత్సవం ర్యాలి నిర్వహించారు తర్వాత ఆమె మాట్లాడుతూ. మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. మహిళల భద్రతతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. కే సి ర్ ప్రభుత్వం స్త్రీలకోసం ప్రత్యేకముగా సమాజంల్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు చట్ట సభల్లో ప్రతిపాదనలు అమలుచేయాలని మహిళలు ఆత్మసైర్థంతో ముందుకు నడవాలని సూచించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,ఉపాద్యక్షురాలు రేణుక , పలు గ్రామాల సర్పచులు సులోచన ,లక్ష్మిబాయి ఎం పి టి సి లు వనజ, సువర్ణ ,సుజాత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment