సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి లోకేష్ రెబ్బెన మండలంలోని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 52రంగాలలో పని చేస్తున్న కార్మికుల కనీస వేతనాల జీ ఓ ల కాల పరమితి ముగిసిందని వివిధ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనము. రూ.15000లు మరియు కరువు భత్యం పాయింట్ కు రూ.10.50పై. ఇవ్వాలని,కోల్ ఇండియా వేతనాలు,బోనస్,కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు ఆసిఫాబాద్ కార్యదర్శి వేములవాడ రమేష్ ,ఓ బి వర్కర్ యూనియన్ నాయుడు మరియు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘంనాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment