Saturday, 5 March 2016

ఉపాది పని కల్పించటం లేదని కూలిల ధర్నా

ఉపాది పని కల్పించటం లేదని  కూలిల ధర్నా

   
రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలో నంబాల గ్రామ పంచాయితీ ప్రజలు ఉపాది హామీ పని కల్పిచటంలేదని  ఉపాది కూలీలు యం పి డి ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు.వారికీ  ఉపాది హామీ పనులు మొదలయి 45 రోజులు గడిచిన అధికారుల నిర్లక్షం వలన మరియు ఫీల్డ్ అసిస్టంట్ లేరని, సీనియర్ మెట్ కి జీతం వస్తాలేదని  కూలీలు అన్నారు.దీనికి స్పందించిన ఎ పి ఓ కల్పన  15 రోజుల లోపు ఉపాది కల్పిస్తామని హామీ ఇవ్వడం తో   గ్రామస్తులు ధర్నాను ఉపసంహరించుకున్నారు. ఈ ధర్నాలో నంబాల  ఉప సర్పంచ్ బి బాను ప్రసాద్ ,వార్డు మెంబర్ అన్నం ప్రభాకర్ ,కొవ్వూరి శ్రీకాంత్ ,రత్నం వెంకటి ,జి శంకర్, పూదరి ప్రవీణ్,టేకం భీమయ్య,డి పద్మ ,జుపాక రాజేశ్వరి మరియు ఉపాది కూలీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment