Thursday, 24 March 2016

90 కోట్ల తో ప్రాణహిత చేవెళ్ళ పై బ్రిడ్జి నిర్మాణం

90 కోట్ల తో ప్రాణహిత చేవెళ్ళ పై బ్రిడ్జి నిర్మాణం 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) సిర్పూర్ నియోజక వర్గం బెజ్జురు మండలం లోని గూడెం వద్ద తెలంగాణా ప్రభుత్వం 90 కోట్ల వ్యయం తో ప్రజల సౌకర్యార్ధం బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు సిర్పూర్  ఎం ఎల్ ఎ కోనేరు కోనప్ప గురువారం వికేకర్ల సమావేశం లో తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజల ముఖ్యమైన   అవసరాలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు . ఈ బ్రిడ్జి నిర్మాణం తో మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,చత్తీష్ ఘాట్ కు ,రవాణా సౌకర్యాలతో పాటు  సంభంద  బాందవ్యాలు మెరుగుపడుతాయని  అన్నారు . సిర్పూర్ నియోజకం,ఆసిఫాబాద్ ,నియోజక,బెల్లంపల్లి నియోజక వర్గాల  ప్రజలకు రావాన , వాణిజ్య,వస్తు మార్పిడి కార్యకలాపాలు పెద్ద మొత్తం లో జరుగుతయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చోరువతో ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు.  

No comments:

Post a Comment