Friday, 11 March 2016

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు హామీల్లో విఫలం

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు హామీల్లో విఫలం 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో పూర్తిగా విఫలమయ్యాయని ఎఐటియుసి గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి అన్నారు. గురువారం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటి తహసిల్దార్ రామమోహనరావు కు అందజేశారు  అనంతరం వారు మాట్లాడుతూ   కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క చట్టాన్ని సవరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. నలభైనాలుగు చట్టాలను మార్చేసి నాలుగు చట్టాలు గ చేయటానికి ఈ కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను చేస్తుందని అన్నారు. ఈ సందర్భం గా వారసత్వ ఉద్యోగాలను పునరుధరించాలని, సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె కాలపు వేతనాలను చెల్లించాలని సొంత ఇంటి పతాకాన్ని అమలు చేసి, నిత్యావసర ధరలను తగ్గించాలని వారు కోరారు. అదే విధంగా అసంఘటిత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్గించాలని వారు డిమాండ్ చేసారు ఈ ధర్నాలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు బి జగ్గయ్య , శేషు , ఏ ఐ ఎస్ యఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్, మండల కార్యదర్శి పుదరి సాయి, యం.సత్యనారాయణ , రవి, బాపు, చక్రధర్, యం. శివారెడ్డి, ఆవుల మల్లేష్, యం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment