రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఒక్క రోజు ధర్నా
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు గ్రామ సేవకుల సంఘం పిలుపు మేరకు మంగళవారం రోజున తహసిల్దార్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందచేసి ధర్నా నిర్వహించారు వి అర్ ఎ ల సంఘం అధ్యక్షుడు ముంజం బుద్దులు మాట్లాడుతూ వి అర్ ఎ లను 4 వ తరగతి ఉద్యగులుగా గుర్తించాలి ,010 పద్దు కింద బడ్జెట్ కేటాయింఛి వేతనాలు ఇవ్వాలి ,కనీస వేతనం 15వేలు పెంచాలి, వి అర్ ఎ లకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ,అర్హత ఉన్న వారికీ ఖాళీపోస్టులను ప్రమోషన్ లతో బర్తి చేయాలి , వి అర్ ఎ లకు ఎలాంటి షరతులు లేకుండావారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి మరియు పెండింగ్ లో వున్నా జీతాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాటిపెల్లి వెంకటేశం డివిజినల్ మెంబర్ ,నాగుల పొశమల్లు ,మాడే గణపతి ,దుర్గం శ్రీనివాస్, వేమునూరి శ్రీనివాస్, స్ కె జమీల్ ,సి ఎచ్ ధర్మయ్య, రోమాజి ,దుర్గయ్య ,డి రాజు ,మల్లయ్య ,రాజలింగు ,పోశయ్య పాల్గొన్నారు
No comments:
Post a Comment