(రెబ్బెన వుదయం ప్రతినిధి)
రెబ్బెన మండల కేంద్రంలోని వెనుకబడు తరుగతుల వసతి గృహం రోజు రోజుకి అస్త వ్యస్తంగా మారుతుంది. .విద్యార్థుల బాగోగులు వసతులు చుస్కోవాల్సిన సంక్షేమ అధికారి నిర్లక్షమే ఇందుకు ప్రత్యేక సాక్ష్యం .ప్రదానంగా వెనుకబడు విద్యార్థులకు వసతి తోపాటు విద్యబోదన, పౌష్టికాహారం అందించాల్సిన సంక్షేమ అధికారి నిర్లక్షమే విద్యార్థులు పాలిట శాపంగా మారింది. మండలంలో ఉన్న బి సి హాస్టల్ లో కాలం చెల్లి పోయిన ఆహార వస్తు సామగ్రి తో విద్యార్థులకు భోజనం పెడుతున్నారని, దీనితో అనారోగ్యం పాలు అవుతున్నారని మండల వాసులు చెబుతున్నారు. గురువారం ప్రత్యేకంగా ప్రసార మరియ ప్రచార మాధ్యమాలు హాస్టల్ కి వెళ్ళగా నివ్వురు పరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి . హాస్టల్ వార్డెన్ గత కొన్ని రోజుల నుండి హాస్టల్ కి రావడం లేదని సరిపడు వంట సామాగ్రి నిల్వలు లేవని వాచ్మెన్ తో పాటు విద్యార్థులు తెలిపారు. హాస్టల్ లో 35 మంది విద్యార్థులు ఉండగా కేవలం 7 గురు విద్యర్హులు మాత్రమే ఉన్నారు. వీరు 10వ తరగతి విద్యార్థులే. ఉన్న ఏడుగురు విద్యార్తులకు కూడా మేను ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు తెలిపారు వార్డెన్ లేక పోవడం తో వాచ్ మెన్ సర్వ విదులను నిర్వహిస్తున్నాడు.దీంతో విద్యార్థులు అసౌకర్యాల లేమితో ఇంటి దారి పట్టారు . అధికారుల నిర్లక్షం తో రాబోవు సంవత్సరం పూర్తిగా హాస్టల్ మూతబడే ప్రమాదం ఉందని తల్లి దండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం వసతి గృహాలలో పదోతరగతి విద్యార్థులు కొరకై రాత్రి వేళ్ళల్లో ప్రత్యక విద్య బోదకున్ని నియమించినప్పటికీ రావడం లేదని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ల్లో ఉన్న అసౌకర్యా లను విద్యార్థులు వెల్లడిస్తే వారిపై కక్ష్య సాదింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టా త్మకంగా చేపట్టిన వసతి గృహాల నిర్వహణ అధికారుల నిర్లక్షంతో వార్డెన్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు దర్పణంలో కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ నిర్వహణ తీరు పై ద్రుష్టి సారిస్తే మెరుగుపడే అవకాశం ఉన్నదని ప్రజలు అంటున్నారు .
No comments:
Post a Comment