Saturday, 5 March 2016

గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లా లోనే ఏర్పాటు చేయాలి

గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లా లోనే ఏర్పాటు చేయాలి 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి): కొమరం భీం సాక్షిగా కొమరం భీం వర్దంతి సందర్భం గా 9 అక్టోబర్ 2014 సం.. గిరిజన దర్భార్ లో వెలది ప్రజలతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయానికి కొమరం భీంపేరు పెడుతూ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆదిలాబాద్ జిల్లా లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని సాదన కమిటీ జిల్లా కన్వీనర్ వేడ్మ భొజ్జు అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూర్ లో ఏర్పాటు చేయుటకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బస్సు యాత్ర శుక్రవారం నాటికి రెబ్బెనకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేథ్కర్ విగ్రహానిలి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమస్యలతో కూడిన వినతి  పత్రాన్ని సమర్పించారు. అనంతరం విద్యార్ధి నాయలకులు మాట్లాడుతూ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూర్ లో ఏర్పాటు చేయుటకై జిల్లాలోని మేధావులు, ఉపాద్యాయులు విద్యార్థులు ప్రజలు కర్షకులు కార్మికులు రాజకీయ పార్టీలు ఐక్యమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ బస్సు యాత్రను ఫిబ్రవరి 29న ప్రారంభించి మార్చ్ 5 వరకు ముగుస్తుంది కాబట్టి అందరు ఈ బస్సుయాత్రను విజయవంతం చేయాలనీ వారు కోరారు. జిల్లలో జరిగిన బహిరంగ సమావేశం లో జిల్లాకు  గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాకు వచ్చేలా కృషి చేస్తానని వాగ్దానం చేసిన అప్పటి ఉద్యమనాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి కే సి ఆర్ తన ప్రసంగం లో చెప్పి ఈరోజు మోస పుర్వితం గా వ్యవహిస్తున్నారని వారు  అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూర్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు, లేని పక్షం లో  ఉద్యమాన్ని దశలవారీగా ఉదృతం చేస్తామని అన్నారు. ఈ యాత్రలో జిల్లా కన్వినర్ ఇందోల్ రాథోడ్ దుర్గం రవీందర్ 
తాళ్ళపల్లి పాపారావు కదతల సాయి దుర్గం భరత్ద్వాజ్ పుదరి సాయి కిరణ్ బోగే ఉపేందర్ పలువురు విద్యార్ధి సంఘ నాయకులు  పలుగున్నారు 

No comments:

Post a Comment