Saturday, 30 April 2016

91 శాతం బొగ్గు ఉత్పత్తి సాదించిన బెల్లంపల్లి ఏరియా

91 శాతం బొగ్గు ఉత్పత్తి  సాదించిన బెల్లంపల్లి ఏరియా 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) ఏప్రిల్ మాసానికి గాను బొగ్గు ఉత్పత్తి సదించడం జరిగిందని బెల్లంపల్లి ఏరియా జి  ఎమ్ రవిశంకర్ అన్నారు రెబ్బెన మండలంలోని గోలేటి  జి  ఎమ్ కార్యాలయం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు 91 శతం బొగ్గు ఉత్పత్తి సా దించమని అన్నారు ఏప్రిల్ మాసానికి   488000 టన్నుల బొగ్గు లక్షం కాగా   443393 ఉత్పత్తి సాదించమని  కైరుగూడ ఓపెన్ కాస్ట్ లో 250000 టన్నుల బొగ్గు లక్షం కాగా 166915 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని    డోర్లి -1  ఓపెన్ కాస్ట్ లో 158000  టన్నుల బొగ్గు లక్షం కాగా 151% 238963 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని డోర్లి -2 80000  టన్నుల బొగ్గు ఉత్పత్తి  లక్షం కాగా 47% 37515  టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించమని రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పున్జుకున్తున్దన్నారు బొగ్గు ఉత్పత్తితో పటు కార్మికుల సంక్షేమానికి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు  గోలేటి కాలనీ లో అర్ ఓ అర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటిని అందచేయడం జరుగుతుందన్నారు గోలేటి లో సెంట్రల్ లైటింగ్ పూర్తీ జరిగిందన్నారు గోలేటి 1 లో విదులు నిర్వహిస్తున్న బదిలీ కొరకు పెట్టుకున్న వారికీ వారి ఇష్టమున్న చోటికి బదిలిచేయడం జరుగుతుందన్నారు బెల్లంపల్లి ఏరియా కు ఈ సంవస్తరం నిర్దేశించిన 61 లక్షల  టన్నుల బొగ్గు ఉత్పత్తి అధిగమించడానికి అభివృద్ధి చర్యలు  చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డి జి ఎం చిత్రంజన్ కుమార్ ఎస్వోటు జి ఎం కొండయ్య ఐ ఇ డి  యోహాన  డి వై పి ఎం . రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నా

స్తానికంగా లేని వి ర్ వో ల పై చర్యలు తీసుకోవాలి


స్తానికంగా లేని వి ర్ వో ల పై చర్యలు తీసుకోవాలి 

  • ఎ ఐ వై ఫ్ జిల్లా ఉపాద్యక్షులు  బోగే ఉపేందర్ 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) గ్రామా ప్రజలకు అందుబాటులోలేని  వి ర్ వో ల పై  తీసుకోవాలని ఎ ఐ వై ఫ్ జిల్లా ఉపాద్యక్షుదు బోగే ఉపేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు వారు మాట్లాడుతూ  రెబ్బెన మండలల్లోని పలు గ్రామా పంచాయితీ లలో పనిచేయు  వి ర్ వో లు స్తానికంగా ప్రజలకు రైతులకు అందుబాటులో లేకపోవడం తో చాల ఇబ్బందులు ఎదురుకున్తున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయస్తానం రాష్ట్ర ప్రబుత్వం  వి ర్ వోలు స్తానికంగా వుండాలని ఆదేశాలు జారి చేసినప్పటికీ మండలంలోని  వి ర్ వో లు తహసిల్దార్ కార్యాలయం లోనే ఉంటున్నారని దీంతో ప్రజలు పలు సమస్యలపై ప్రతిరోజూ మండుటెండలో వేడిని సైతం లెక్క చేయకుండా  వృద్దులు వికలాంగులు అంతకుడ  రెబ్బెన కు రావలసి వస్తుందని దీంతో ఆర్థికంగా చాల నష్ట పోతున్నారని అన్నారుఅధికారుల  పర్యవేక్షణ నిర్లక్షం కారణంగానే  వి ర్ వోలు స్తనికంగా వుండడం లేదని ఇప్పటికైనా  తహసిల్దార్  స్పందించి స్తనికంగా ప్రజలకు అందుబాటులో వుండాని   వి ర్ వో ల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షం లో  -ఎ ఐ వై ఫ్ అద్వర్యం లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు 

మేడేను విజయవంతం చేయండి

 మేడేను  విజయవంతం  చేయండి  

  • ఎఐ టి యు సి  బ్రాంచ్ అద్యక్షుడు  బోగే ఉపేందర్ 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) నేడు జరగాబోయే కార్మికుల   దినోత్సవన్ని ఘనంగా జరుపుకోవాలని ఎ ఐ టి యు సి  బ్రాంచ్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ కోరారు శనివారం రోజున రెబ్బెన మండల కేంద్రం లో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోస్తావం అయిన మేడే  వేడుకలను కార్మికులు వడవాడలో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు  కేంద్ర  ప్రబుత్వాలు కార్మికుల ప్రయోగానలను సంక్షేమాన్ని విస్మరించి  జాతి సంస్తలకు కార్పొరేట్   సంస్తలకు  పిటా వేస్తున్నాయని అన్నారు 

భూసార పరీక్షలతో అధిక దిగుబడులు

 భూసార పరీక్షలతో అధిక దిగుబడులు 


 (రెబ్బెన వుదయం ప్రతినిధి) రైతులు వ్యవసాయ భూసార పరీక్షలు చేయించుకోని పంటలను పండిస్తూ అధిక దిగుబడులను సాధించాలని మండల వ్యవసాయాధికారిణి మంజుల అన్నారు. శనివారం  రెబ్బెన మండలంలోని తక్కలపల్లి   గ్రామాల్లో మన తెలంగాన-మన వ్యవసాయం అవగాహన సదస్సులో మంజుల మాట్లాడుతూ రైతులు , పాడిపశువుల పెంపకం చేపట్టి ఆర్థికంగా ప్రగతి పథంలోకి సాధించాలని కోరారు. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోరకు సబ్సిడీపై అందించే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట వేస్తూ నష్టపోతున్నందున రైతుల దృష్టిని సాంప్రదాయ పంటలవైపు మళ్లించేందుకు  తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నందున జిల్లాలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పత్తిపంట వేయకుండా వారిని చైతన్యపర్చేందుకు మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయాదికారులు ఊరురా రైతులను చైతన్యపరుస్తున్నారు. రైతులు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వస్తాయని,  ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటించి, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వ్యవసాయం చేసి అదిక దిగుబడి సాదించాలని రసాయన ఎరువులను వాడితే బుసారం దెబ్బతిని దిగుబడులు తక్కువకు కారణం అవుతాయి అని అన్నారు.  ఈ సదస్సులో పశువైద్య అధికారి సాగర్, సర్పంచ్‌ మాడే చిన్నయ్య , సింగల్ విండో చైర్మన్ గాజుల రవి , ఎం ప్ టి సి లు తదితరులు పాల్గొన్నారు 

సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు-ఎ ఒ మంజుల

 సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు-ఎ ఒ మంజుల 


 (రెబ్బెన వుదయం ప్రతినిధి) రైతులు వ్యవసాయ ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటించి, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వ్యవసాయం చేసి అదిక దిగుబడి సాదించాలని మండల వ్యవసాయాధికారిణి మంజుల అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని తుంగేడ గ్రామాల్లో మన తెలంగాన-మన వ్యవసాయం అవగాహన సదస్సులో మంజుల మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకోని పంటలను పండిస్తూ అధిక దిగుబడులను సాధించాలని, పాడిపశువుల పెంపకం చేపట్టి ఆర్థికంగా ప్రగతి పథంలోకి సాధించాలని కోరారు. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోరకు సబ్సిడీపై అందించే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట వేస్తూ నష్టపోతున్నందున రైతుల దృష్టిని సాంప్రదాయ పంటలవైపు మళ్లించేందుకు  తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నందున జిల్లాలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పత్తిపంట వేయకుండా వారిని చైతన్యపర్చేందుకు మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయాదికారులు ఊరురా రైతులను చైతన్యపరుస్తున్నారు. పత్తి విస్తీర్ణం తగ్గించడం ద్వారా ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వస్తాయని, రసాయన ఎరువులను వాడితే బుసారం దెబ్బతిని దిగుబడులు తక్కువకు కారణం అవుతాయి అని అన్నారు.  ఈ సదస్సులో పశువైద్య అధికారి సాగర్, సర్పంచ్‌ లక్ష్మి భాయి, ఉప సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 27 April 2016

ఎండకు వెళితే జాగ్రత్తలు అవసరం - తహసిల్దార్

ఎండకు వెళితే జాగ్రత్తలు అవసరం - తహసిల్దార్
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున తప్పకుండ ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని రెబ్బెన తహసిల్దార్ బి రమేష్ గౌడ్ అన్నారు . బుధవారం ఆయన మాట్లాడుతూ గత  ఏడాది కంటే ఉష్ణోగ్రతలు తీవ్రత అధికంగా ఉందని , ఎండకు వెళితే త్రాగు నీరు తప్పని సరి వెంట తీసుకెళ్లాలని , గొడుగు లేదా తలకు గుడ్డను కట్టు కోవాలని  అన్నారు . అదే విధంగా పిల్లలు , వృద్దులు ఎండకు బయటకు వెళ్లకూడదని ఆయన తెలిపారు . ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు . ఎవై న పనులు ఉంటె 10 గంటల లోపే ముగించుకొని  సాయంత్రము  5 గంటల తరువాతే బయటకు వెళ్లాలని అన్నారు.



గుర్తు తెలియని వాహానం డీకొని 16 గొర్రెలు మృతి 2గాయాలు

గుర్తు తెలియని వాహానం డీకొని 16 గొర్రెలు మృతి 2గాయాలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని నక్కల గూడా సమీపములో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహానం డీకొని  16 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 2 గొర్రెలకు తీవ్ర గాయాలయాయి . రాజయ్య గొర్ల కాపరి తెలిపిన వివరాల ప్రకారము మంగళ వారము రాత్రి నక్కల గూడా జాతీయ రహదారిపై గొర్ల మందను దాటిస్తుండగా మామిడిపళ్ళ లోడుతో ఉన్న ట్రాలీ అతివేగంగా వచిందని,  చేతి ఊపిన ఆపకుండా గోర్లపై నుండి దూసుకేల్లిందని , కళ్ళెదుటే ఈ దారుణం జరిగిందని తట్టుకోలేక పోయానని కన్నీరు మున్నీరు అవుతూ తెలిపారు. ఒక్కొక్క గొర్రె విలువ 8000 వేల రూపాయల నుండి 9000 ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు . మొత్తం మృతి చెందినా గొర్ల విలువ 150000 రూపాయలవరకు  ఉంటుందని అన్నారు . ఈ గొర్రెలు రెచిని ఎగ్గే మల్లయ్య కు చెందినవని తెలిపారు .

Tuesday, 26 April 2016

నిప్పుల కోళిమిని తలపిస్తున్న ఎండలు

 నిప్పుల కోళిమిని తలపిస్తున్న ఎండలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో  గత ఎడాది కంటే కూడా ఈ ఎడాది అత్యదికంగా ఉష్ణోగ్రతలు నమోదు తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు , మరో పక్క ఉదయం 8 గంటల ప్రాంతం లోనే నిప్పుల కొలిమినిల  తలపిస్తుంది. దీంతో చిన్న పిల్లలు నుండి వృద్దుల వరకు ఎండా వేడిమికి తట్టుకోలేఖపోతున్నారు.  ఇదిలా ఉండగా ప్రజా ఆరోగ్య శాఖ మాత్రం ప్రజల ఇబ్బందులను పట్టించు కోకుండా గాలికి వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి .జిల్లాలో ఎండల తీవ్రత 46డిగ్రీలు  మించి కాస్తునాయని వాతావరణ శాకాదికారులు చెబుతున్నారు, గత ఏడాది ఈ మాసంలో ఎండల తీవ్రత తక్కువగా ఉందని అధికారులు అంటులున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి సంభందిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు వాపోతున్నారు. మండలం లో సుమారు 25000 వేల జనభా ఉన్నపటికీ వారికి సరిపడు నీటి కోలాయీలు లేక తీవ్ర దహర్తికి గురౌతున్నారని సామజిక షాస్త్రవేత్తలు చెబుతున్నారు.  మరియు ఎండల తీవ్రాతలనుండి రక్షణ పొందు సూచనలు, అవగాహన కార్యక్రమలను చేపట్టాల్సిన శాఖలు నిర్లక్ష వ్యెకరిని అవలంబిస్తున్నాయి.  ప్రజా సౌకర్యాల పట్ల ప్రతి  ఒక్కరు నిబద్దతతో ఉండాల్సిన అవసరం ఎంతయిన ఉంది. ఇకనైన సంబందిత శాఖలు ప్రజల ఇబ్బందుల ను గుర్తు వుంచుకోవాల్సిందిగా సమస్త  జనులు కోరుతున్నారు .

Sunday, 24 April 2016

యోగ శిక్షణ తరగతులు ప్రారంభం

యోగ శిక్షణ తరగతులు ప్రారంభం 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో గోలేటి గ్రామంలో ఆదివారం నాడు సి ఇ అర్ క్లబ్ లో  సింగరేణి వారి అద్వర్యం లో యోగ శిక్షణ తరగతులు ప్రారంబించారు మీకోసం మీ ఆరోగ్యం అని యోగ శిక్షణ  ఏర్పాటు చేసిన కార్యక్రంలో   సీతారామయ్య ,ఎస్ ఓ టు జి ఎం  కొండయ్య  మాట్లాడుతూ యోగ తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతున్నదని  అన్నారు  ప్రతి ఒక్కరికి    యోగ అవసరమని ,మానసిక రుగ్మతలు దూరం చేయుటకు యోగ మెడిటేషన్ చేయాలనీ పని బార ఒత్తిడిలను తట్టుకునేందుకు ప్రతి ఒక్కరు యోగాను చేయాల్సిన అవసరం వుందని అన్నారు.  ముఖ్యముగా చిన్న పిల్లలు చదువు పై దృష్టి, మతిమరుపులు రకుంట మంచి ఉద్దేశాలతో సన్మర్గలతొ ఉన్నత స్టాయికి ఎదుకుటకు  తోడ్పడుతుందని అన్నారు  ఈ యోగ శిబిరము లో యోగ శిక్షణ బోధకులు గాయత్రీ ,పూజ ప్రకాష్ , కార్మిక సంఘ నాయకులు సదాశివ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదం లో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదం లో యువకుడి మృతి 
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో దేవులగూడ నివాసి కున్సాత్ రాజ్ కుమార్ (19) ఆదివారం ఊదయం సుమారు 3 గంటల ప్రాంతంలో గోలేటి నుండి బైక్ పై తిరిగి వస్తుండగా దేవులగూడ సమీపం లో గ్ఫుర్తుతెలియని వాహనం డీకొని మృతి చెందాడని మృతుడి మామయ్య   రామ్ కుమార్   పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  రెబ్బెన ఇంఛార్జ్ ఎస్ ఐ  టీవీ రావు తెలిపారు

రెబ్బెన గ్రామా పంచాయితీ అద్వర్యంలో చలివెంద్రం ఏర్పాటు

రెబ్బెన గ్రామా పంచాయితీ అద్వర్యంలో చలివెంద్రం ఏర్పాటు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లో  ఆదివారం గ్రామా పంచాయితీ అద్వర్యంలోఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ప్రారంబించారు  చలివెంద్రం  ఏర్పాటు చేసారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుటెండలో ప్రయాణికులకు కోసం  చల్లటి నీళ్ళు తాగడానికి ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో మండల ఎం పి పి  సంజీవ్ కుమార్ జడ్ పి టి సి బాపూరావు వైస్   ఎం పి పి  రేణుక సర్పంచ్ వెంకటమ్మ తూర్పు  జిల్లా ఊపద్యక్షుడు నవీన్ కుమార్  జైస్వాల్  ఊ ప సర్పంచ్ శ్రీధర్ కుమార్   తెలుగుదేశం మండల అద్యక్షుడు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Saturday, 23 April 2016

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం - జి ఎమ్ రవి శంకర్

 యోగాతో  సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం - జి ఎమ్ రవి శంకర్ 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); యోగ తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతున్నదని  బెల్లంపల్లి జి ఎం రవి శంకర్ అన్నారు   రెబ్బెన మండలం గోలేటి లో మీకోసం మీ ఆరోగ్యం కోసం అని ఏర్పాటు చేసిన కార్యక్రంలో అయన మాట్లాడారు ప్రతి ఒక్కరికి    యోగ అవసరమని ,మానసిక రుగ్మతలు దూరం చేయుటకు యోగ మెడిటేషన్ చేయాలనీ పని బార ఒత్తిడిలను తట్టుకునేందుకు ప్రతి ఒక్కరు యోగాను చేయాల్సిన అవసరం వుందని అన్నారు.  ముఖ్యముగా చిన్న పిల్లలు చదువు పై దృష్టి, మతిమరుపులు రకుంట మంచి ఉద్దేశాలతో సన్మర్గలతొ ఉన్నత స్టాయికి ఎదుకుటకు  తోడ్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షురాలు అనురాధ కార్మిక సంఘ నాయకులు సదాశివ్, తిరుపతితదితరులు పాల్గొన్నారు

మేనేజర్ల నిర్లక్ష్యంతో నీలి నీడలలో ముద్ర రుణాలు

మేనేజర్ల నిర్లక్ష్యంతో నీలి నీడలలో ముద్ర రుణాలు 
- చిరు వ్యాపారులను ఆదుకొనని బ్యాంకర్లు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); కేంద్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన ముద్ర పతాకాన్ని చిరు వ్యాపారులకు లోన్లు మంజూరు చేయాల్సి వుండగా రెబ్బెన మండల లోని  బ్యాంకర్ల మేనజేర్ల నిర్లక్ష్యం వల్ల ముద్ర రుణాలు నీలి నీడలలో మగ్గుతున్నాయని బి సి ఐఖ్య సంగర్షణ సమితి జిల్లా  అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు ఏసీ, ఎస్టి ,బి.సి కార్పరేషన్ లోన్లు మేనేజర్  ఇష్ట రాజ్యముగా వ్యవహరించి నిభందనలు వ్యతిరేకముగా అనర్హులకు  కేటాయించి,  అర్హులకు అన్యాయం చేస్తున్నారని అయిన ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికి  అయిన ఉన్నతాధికారులు చొరవ చేసుకొని రెబ్బెన మండలంలోని  మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను చిరు వ్యాపారులకు అందే విధముగా చూడాలనిఆయన డిమాండ్ చేశారు అలా చేయని పక్షంలో బ్యాంకు ల ముందు ఆందోళన కార్యక్రమాలు దశల వారిగా చేస్తామని డిమాండ్ చేశారు .  

Thursday, 21 April 2016

రైతు,ప్రజా సమశ్యలను పరిష్కరించాలి - భారత కమ్యునిష్టు పార్టి సి.పి.ఐ

రైతు,ప్రజా సమశ్యలను పరిష్కరించాలి - భారత కమ్యునిష్టు పార్టి సి.పి.ఐ


(రెబ్బెన వుదయం ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలని,వర్షాలు సకాలంలో కురియక పోవడం తో పంటలు పండక రైతులు తీవ్ర ఇబంధులకు గురవుతున్నారని, రైతు,ప్రజా సమశ్యలును పరిష్కరించాలని సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సబ్యులు యస్ తిరుపతి గురువారం రెబ్బెన తహసిల్దారురమేష్ గౌడ్ కి వినతి పత్రం అందజేసి ప్రధాన రహదారి పై ధర్న నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  వర్షాలు సకాలంలో కురియక పోవడంతో పంటలు పండక రైతులు తీవ్ర ఇబంధులకు గురవుతున్నారని జిల్లాలోని  అన్నిమండలాలను కరువు మండలాలుగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రతి జిల్లాకు నష్ట పరిహారం రెండు వందల కోట్లు కేటాహించాలని అన్నారు గ్రామలో నీటి ఎద్దడి ఉన్నందున ప్రబుత్వం స్పదింఛి గ్రామలో నీటి సౌకౌర్యం కల్పించాలని, తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.  నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయలని, రెండు గదుల ఇండ్లు వెంటనే మంజూరు చేయాలనీ ,రైతు,ప్రజా సమశ్యలును పరిష్కరించే వరకు సి.పి.ఐ  భారత కమ్యునిష్టు పార్టి అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుమని అన్నరు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బి జగ్గయ్య ఎఐయైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ ఎఐఎస్ యఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ , గణేష్ ,తిరుపతి,సాయి,రవికుమార్,నర్సయ్య లు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 19 April 2016

నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాలు భూ పంపిణి

నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాలు  భూ పంపిణి



(రెబ్బెన వుదయం ప్రతినిధి); రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణి నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయడం అభినందనీయమని శాసన సభ  సభ్యురాలు కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయంలో    భూ పంపిణి  కార్యక్రమం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆరుగురికి 17. 37 ఎకరాల నిరుపేద దళిత కుటుంబాలకు రెబ్బెన మండలం లో మొదటిసారిగా పంచడం జరిగింది అని  అన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భుపంపిని  అధికారుల జప్యం వాల్ల ఆలశ్యం అవుతుందని అధికారులు వెంటనే భూమిని కొనుగోలుచేసి ఎదోరకంగా ప్రభుత్వ భూములను పరిశీలించి  వారం రోజులలో 2000 ఎకరాల భూమి సేకరణ చేసి నిరుపేదలకు పంపిణి చేయాలనీ ఆమె అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాలలో త్రాగునీటి ఎద్దెడి నివారించేందుకుగాను గ్రామా సర్పంచులు, ఎమ్ పి టి సీ లు ,వార్డ్ మెంబర్ లు అధికారులు గ్రామా గ్రామాలకు వెళ్ళి నిటి ఎద్దటి సమస్యలు వుంటే పరిశీలించి సకాలంలో నీరు అందేలా చేయాలనీ అన్నారు. ఎస్సి,ఎస్టి లకు కళ్యాణ లక్ష్మి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది  అని, శాసన సభలో నిరు పేద  బి.సి, ఓసి లకు కూడా కళ్యాణ లక్ష్మి వర్తించేలా చర్చలు జరుగుతున్నాయి అని, త్వరలో జి ఓ కూడా వస్తుంది అని   అన్నారు. ఈ కార్యక్రమంలో యం.పి.టి. సి కొవ్వూరి  శ్రీనివాస్,మాట్లాడుతూ భూ పంపిణి లో దళితుడి దగ్గర కొని, మరో దళితునుకి ఇస్తే ఈ రెండు కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళం అవుతం అని, అదేవిధముగా రాజకీయ నాయకులకు లబ్ది పొందకుండా నిరు పేద దళితులకు ఉపయోగకారముగా భూపంపిణి చేయాలనీ అన్నారు. గతంలో కుడా 97 మంది రైతులకు భూ సాగు  కింద 300 ఎకరాల భూమి  పట్టా పాసు పుస్తకాలు పంపిణి చేయడం లేదని అన్నారు అధికారులు చర్య తీసుకోని పట్టా పాసు పుస్తకాలు  పంపిణి  త్వరగా చేయాలనీ అన్నారు.  ఈ కార్యక్రమంలో తహసిల్దార్  రమేష్ గౌడ్ మాట్లాడుతూ సకాలంలో వి అర్ ఓ లు అధికారులను భూ సర్వే చేయించి,  నిరు పేద దళిత  కుటుంభాలకు భూ పంపిణి కార్యక్రమం ద్వారా  అందచేసే విధముగా చూస్తామని అన్నారు.  అదేవిధముగా యం పి పి సంజీవ్ కుమార్,జడ్ పి టి సి బాబురావు లు కూడా భూ పంపిణి నిరు పేద  దళితులకు అందే విధముగా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో   సర్పంచులు పెసరు వెంకటమ్మ, గజ్జల సుశీల, చిన్నయ, వెమునురి వెంకటేశ్వర్లు. టి అర్ ఎస్ తూర్ప జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ జేశ్వల్, ఉపసర్పంచు శ్రీధర్ కుమార్, చేన్నసోమశేకర్,  ఉప తహసిల్దార్ రామ్మోహన్  రావు మరియు  తదితరులు పాల్గొన్నారు.

Monday, 18 April 2016

గోలేటి లో న్యాయ విజ్ఞాన సదస్సు

గోలేటి లో న్యాయ విజ్ఞాన  సదస్సు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ని గోలేటి లో న్యాయ సేవా సమితి ఆధ్వర్యములో న్యాయ విజ్ఞాన సదస్సును సోమ వారము నిర్వహించారు .గోలేతిలోని ఆఫీసర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సదస్సులో   ఆసిఫాబాద్ సివిల్ జడ్జి ఎన్ హేమ లతా  పాల్గొని మాట్లాడారు .చట్టం  ఎవరికి చుట్టము కాదని,చట్టం దృష్టిలో న్యాయం అందరికి సమానమేనని అన్నారు.  మారుతున్న కాలానికి పరిస్థిలకు అనుగుణంగా   చట్టాలపై మార్పులు వస్తున్నాయని ఆమె అన్నారు . వైట్ కాలర్ నేరాలు జరుగుతున్నాయని ప్రజలు అపరమత్తంగా ఉండాలని అన్నారు . ఈ సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు సమ చార హక్కు చట్టం , గృహ హింస బాల్య వివాహాలు తడితార అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్య క్రమములో బెల్లం పల్లి జి ఎం రవిశంకర్ , న్యాయ వాదులు సురేష్ , సతీష్ బాబు ఎన్ రవీందర్ , రాజేష్ , నరహరి , కార్మిక సంఘ నాయకులు సదాశివ్ , ఎస్ తిరుపతి డిప్యూటి పి  ఎం రాజేశ్వర్ లు ఉన్నారు .  

కలప దుంగలు పట్టివేత

కలప దుంగలు పట్టివేత   

(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో టేకు కర్ర దొంగ రావాన విచ్చల విడిగా సాగుతుంది గతములో ఎన్నో సార్లు బొగ్గు లారీల పై , వ్యాన్ లలో , సుమోలలో అక్రమంగా రవాణా చేస్తుండగా అటవీ శాఖాధి కారులు పట్టుకొని సీజ్ చేశారు , కానీ దొంగ రవాణా మాత్రం ఆగుతలేదని,  . అటవీ అధికారుల కను సన్నలలో దొంగ కలప అక్రమ రావాన సాగుతున్నట్లు మండల వాసులు అంటున్నారు ఆదివారం రాత్రి దుర్గాపూర్ నుంచి గోలేటి   వైపు వెళ్తున్న ఆటో  నంబర్  ఎ పీ 15 వి 6800 గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను. ఎఫ్ అర్  వో వినయ్ కుమార్ బాబు  అందించిన సమాచారముతో డిప్యూటి ఆర్ వో శ్రీనివాస్ పకడ్బందిగా ఉపాయముతో  పట్టు కున్నారు. 2  టేకు  దుంగలు , వాటి విలువ 4576 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. అదిలా ఉండగా గోలేటి రోడ్ వెంట ఆయన సిబ్బందితో వెతకగా టేకు దుంగలు 30 దొరికాయని అన్నారు. బీట్ అధికారులు ఎం డి అతరోద్దిన్ . మహ్మాద్ సిబ్బంది పాల్గొన్నారు .

Sunday, 17 April 2016

పెధ బడుగు బలహీన వర్గాల ప్రజలు సమష్యలు నేరవెర్చాలి - సి.పి.ఐ

పెధ బడుగు బలహీన వర్గాల ప్రజలు సమష్యలు నేరవెర్చాలి - సి.పి.

(రెబ్బెన వుదయం ప్రతినిధి) పెధ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు కొంటున సమష్యల పై సి.పి.ఐ  భారత కమ్యునిష్టు పార్టి అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ తిరుపతి మండల కార్యదర్శి పొన్నం శంకర్ లు అన్నారు ఆదివారం రోజున రెబ్బన మండలం లోని గోలేటి కె ఎల్ మహేందర్ భవన్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బిజెపి ప్రభుత్యం అధికారం లోకి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు ఈ నెల 20 వ తేదిన మండల తహసిలు దారు కార్యాలయం ముందు 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బి జగ్గయ్య ఎఐయైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ ఎఐఎస్ యఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ , గణేష్ ,తిరుపతి,సాయి,రవికుమార్,నర్సయ్య లు పాల్గొన్నారు 

వడ దెబ్బకి ఉపాధ్యాయుడి మృతి


వడ దెబ్బకి ఉపాధ్యాయుడి మృతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని గంగాపూర్ ఉన్నత పాటశాలలో సోషల్  ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మద్యల నర్సయ్య  (50 ) వడ దెబ్బతో శని వారము మృతి చెందాడు . శుక్ర వారము ఎండకు ఎక్కువగా తిరిగాడని  రాత్రి నుండే అస్వస్థకు గురి అయ్యాడని భార్య తెలిపింది . మృతుడి   స్వస్థలం కడెం మండలం లోని మున్యాల గ్రామము  . మ్రుతుడికి భార్య ఇద్దరు పిల్లలు  ఉన్నారు . దాహన కర్చుల నిమితము  20 వేల రూపాయలు ఆ పాటశాల ప్రధానోపాధ్యాయుడు వామన మూర్తి తక్షణమే అందజేశారు . మృతుడిని స్వస్థలానికి తీసికెళ్లారు .ఈ సంఘటన స్థలాన్ని ఎం పి  పి  సంజీవ్ కుమార్ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు  శ్రీధర్ రెడ్డి సందర్శించారు. . ఈ కార్య క్రమములో పి  ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్షడు బత్తుల సదానందం , అధ్యక్షా కార్య దర్షులు ఖాదర్ , రవి , ఉపాధ్యాయులు ఉన్నారు. 

గీతా కార్మికులను ఆదు కోవాలి - అన్జనేయులు గౌడ్

గీతా కార్మికులను ఆదు కోవాలి - అన్జనేయులు గౌడ్ 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని నారాయణ్ పుర గ్రామ శివారులో 3000ఈత చెట్లు కాలి బూడిదయ్యాయని , గీతా కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ గౌడ జన హక్కుల సంగం పోరాట సమితి జిల్లా ఇంచార్జి కేసరి ఆంజనేయులు  గౌడ్  శనివారము రెబ్బెన తహసిల్దార్ బి రమేష్ గౌడ్ గారికి  వినతి పత్రాన్ని అందజేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ 3000 ఈత చెట్లు కాలి పోవడముతో 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని , జీవన ఉపాదిని కోల్పోయయని , ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని తెలిపారు . ఈత చెట్ల పన్నులు , అబ్కారి లైసెన్సు ఫీజులు మాఫీ చేయాలని అన్నారు . 560 జి ఓ ప్రకారము ఈత వనము పెంచడానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని తెలిపారు . ఈ కార్య క్రమములో గౌడ సంఘం నాయకులు సుదర్శన్ గౌడ్ , ఆర్ రాజు , గీతా కార్మికులు శంకర్ గౌడ్ , పర్ష గౌడ్ , మాల్లా  గౌడ్ , రవీందర్ గౌడ్ , తిరుపతి గౌడ్ , వెంక గౌడ్ లు ఉన్నారు 

గ్రామ పంచాయాతి ఆద్వర్యం లో పారిశుద్యం

గ్రామ పంచాయాతి ఆద్వర్యం లో పారిశుద్యం 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన గ్రామ పంచాయితి  ఆధ్వర్యములో పారిశుధ్య పనులను గ్రామోధాయ్ సే భారత్ ఉదయ అభియాన్ కార్యక్రమములో భాగంగ శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగ పలు వాడలలో పారిశుధ్య పనులు  చేశారు . ఈ సందర్భంగా డి ఎల్ పి  ఓ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్నా సంక్షేమా పథకాలను ప్రజలకు తెలియ జేయాలని అన్నారు. ఈ కార్య క్రమములో ఇ  ఓ పి  ఆర్ డి కిరణ్ , కార్య దర్శి రవీందర్ , గ్రామా సర్పంచ్ పెసరి వెంకటమ్మ , సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య లు పాల్గొన్నారు. 

Friday, 15 April 2016

అగ్నిమాపక వారోత్వవా లు

అగ్నిమాపక వారోత్వవా లు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) :  అగ్నిమాపక వారోత్వవా ల్లో  బాగంగ రెండోవ రోజున రెబ్బెన లో అగ్నిమాపక సిబ్బంది  అగ్నిప్రమాదం జరిగినపుడు ఎలాంటి జాగ్రతలు తిస్కోవాలో వారియొక్క జల విన్యాసం ద్వార రెబ్బెన ప్రజలకు అవగాహనా కలిపించారు. అగ్నిమాపక యంత్రంతో వివిధ విన్యాసాలు ప్రదర్శించరు. ఇందులో  కె లక్ష్మన్ , ఎస్  కిషన్ , ర్ కాంత రావు , డి చంద్రయ్య, యం బానయ్య ,జి విజయ్ కుమార్, ఇ విజయ్ కుమార్,పి రాజేందేర్ , ఎస్  దాస్ , ఎ రమేష్  పాల్గొన్నారు ... 

సీత రామ కల్యాణోత్సవం

                 సీత రామ  కల్యాణోత్సవం 





రెబ్బెన: మండల కేంద్రం లోని శ్రీ కోదండ రామాలయం లో సీతా రాముల కళ్యానం అంగ రంగ  వైబొగంగ  జరిగింది మండలంలోని పలు గ్రామాలకు చెందిన బక్తులు అదిక  సంక్యలో ఆలయానికి వచ్చి కళ్యాణ వైభోగాన్ని తిలకించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. మరియు ఈ కళ్యాణ మహొత్సవాన్ని  తిలకించిన భక్తులకు సర్వ సుక   శాంతులు కలుగుతాయని పండిత వర్యులు చెబుతున్నారు. స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు పి వి దుర్గారావు దంపతులు సమర్పించారు. ఈ కళ్యాణ మహొత్సవంలో  మరో 20 జంటలు ఈ కల్యాణంలో పల్గొన్నారు . ఈ కళ్యాణ మహొత్సవంలో, ఆలయ రునధాత పరమేశ్వర్ లాల్ జైస్వాల్ మరియు  ఆలయ కమిటి సబ్యులు : మోడెం సుదర్శన్ గౌడ్ , చెన్న సొమశెకర్, పెసరి వెంకటమ్మ, నట్రాజ్,గంటుమెర,అజయ్ జైస్వాల్, గోడీసెల రేణుక , బొమ్మినేని శ్రీధర్, గజ్జెల సుశీల , కర్నదం సంజీవ్ ,సి ఐ డి--డి ఎస్ పి రవికుమార్ , తహసిల్దార్ రమేష్ గౌడ్లు పలుగున్నారు.  . అనంతరం భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి పల్లకి సేవ ఊరేగించారు.    

నార్లపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదం-ఈత చెట్లు దగ్దం

నార్లపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదం-ఈత చెట్లు దగ్దం 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం  నార్లపూర్ గ్రామంలో గురువారం  మద్యనం  అగ్ని ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  ఈత చెట్లు అగ్ని కి దగ్దమయ్యాయి 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని జిల్లా గౌడ సంఘ  అద్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు.  20 కుటుంబాలకు ప్రబుత్వం తరుపున ఆర్టిక సహాయం అందజేయాలని కోరారు నార్లపూర్ లో గౌడ కులస్తులు పూర్తిగా కల్లుమీదే అదరపడి జీవన ఓపది పొందుతున్నారు ఈలాంటి ఘోర అగ్ని ప్రమాదాలకు ప్రబుత్వం బాద్యత వహించి తక్షిణ సహాయం అందజేయాలని కోరారు. ఈఈ దుర్ఘటనలో రెబ్బెన గౌడ సంఘ మండల అద్యక్షుడు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్,శంకర్ గౌడ్, బాప గౌడ్, మల్ల గౌడ్, తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు   






ఘనంగా అంబేద్కర్125 వ జయంతి వేడుకలు



ఘనంగా అంబేద్కర్125 వ జయంతి వేడుకలు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లో డాక్టర్ భీమ్రావు  అంబేద్కర్ జయంతి125 జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు తహసిల్దార్ రమేష్ గౌడ్ అంబేద్కర్ చిత్ర పథానికి  పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దళితులకు చేసిన సేవల గురించి మాట్లాడారు వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు భారత రాజ్యాంగ కర్త  డాక్టర్ భీమ్రావు  అంబేద్కర్ అని అన్నారు ఈకార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ మండల సర్పంచ్ పెసరు వెంకటమ్మ మాజీ సర్పచు దుర్గం   హన్మంతు ,ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,రెబ్బెన మండల అద్యక్షుడు పెరుగు శంకర్ ,దుర్గం సోమయ్య ,లింగయ్య, అజ్మీర రమేష్ ,రాములు ,బొంగు నర్సింగరావు, బోగే ఉపెందర్, వెంకటేష్ ,దుర్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు

ఇంపాక్ట్ స్వచ్చంద సంస్థ అద్వర్యం లో 125వ జయంతి వేడుకలు

ఇంపాక్ట్ స్వచ్చంద సంస్థ అద్వర్యం లో 125వ జయంతి వేడుకలు 



(రెబ్బెన వుదయం ప్రతినిధి) డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 125 ఇంపాక్ట్ స్వచ్చంద సంస్థ అద్వర్యం లో ఘనంగా జరిపారు ముందుగ కేకు కట్ చేసి అంబేద్కర్ పథానికి   సంస్థ అద్యక్షుడు ఎమ్ . హరినాథ్ పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దళితులకు చేసిన సేవల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం ఎ అమీర్ ఉస్మాని కో ఆప్షన్ సభ్యులు ఎం ఎ జాకీర్  ఉస్మాని అంబేద్కర్ మండల సంఘం కార్యదర్శి  డి . దేవాజి,లింగయ్య, లెక్చరర్స్ మల్లేష్ ,ఫణికుమార్, ప్రవీణ్ ,సంతోష్ ,శోబన్ ,గణేష్ పాల్గొన్నారు 

రెబ్బెనలో ఘనంగా అంబేద్కర్ 125 జయంతి

రెబ్బెనలో ఘనంగా  అంబేద్కర్ 125 జయంతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) అంబేద్కర్ 125వ  జయంతిని పురస్కరించుకుని రెబ్బెన  మండలకేంద్రంతోపాటు గోలేటి టౌన్‌షిప్‌, గంగాపూర్‌, కిష్టాపూర్‌, నారాయణపూర్‌, తుంగెడ, పోతపెల్లి, రాంపూర్లలో అంబేద్కర్‌ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మండలకేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పంచశీల జెండాను రెబ్బెన రెబ్బెన మండల అంబేద్కర్ అద్యక్షులు పెరుగు శంకర్ ఆవిష్కరించారు. ఎం పి డి ఓ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపతనికి పూలమాల వేసిఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం కేకు కోసి మిఠాయిలు పంచారు   కార్యక్రమాల్లో ఎంపిపి సంజీవ్‌కుమార్‌, ఎంపిడిఓ ఎంఎ హలీం, తహసీల్దార్‌ రమేష్ గౌడ్ , బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ రాంనారాయణ, సర్పంచులు పెసరు  వెంకటమ్మ, తోట లక్ష్మణ్‌, వైస్‌ ఎంపిపి రేణుక, ఎంపిటిసిలు కొవ్వూరి శ్రీనివాస్‌, వనజ, డిప్యూటీ తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, , నాయకులు నవీన్‌జైస్వాల్‌, శంకరమ్మ, చిరంజీవిగౌడ్‌, దుర్గం దేవాజీ, మొండయ్య, బొంగు నర్సింగరావు, దుర్గం సోమయ్య ,లింగయ్య, అజ్మీర రమేష్ ,రాములు ,బొంగు నర్సింగరావు, బోగే ఉపెందర్, వెంకటేష్ ,దుర్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు  

Wednesday, 13 April 2016

అంబేద్కర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి

అంబేద్కర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి

(రెబ్బెన వుదయం ప్రతినిధి)  భారత ప్రదాని నరేంద్ర మోడీ ఆదేశాల అనుసారంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రెబ్బెన మండలంలో బి.  జె. పి . పార్టీ అద్వర్యం లో  బుధవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాణ సృష్టికర్త అంబేద్కర్ 125వ జయంతి ని ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో  జిల్లా కాంట్రాక్టు సెల్ అద్యక్షుడు చక్రపాణి రెబ్బెన బి.  జె. పి .మంఫ్దల అద్యక్షుడు బాలకృష్ణ  అసెంబ్లీ ఇం  ఛార్జ్  సతీష్ గంగాపూర్ సర్పంచ్ రవీందర్,రెబ్బెన మండల అంబేద్కర్ అద్యక్షులు పెరుగు శంకర్ , ఆదివాసీ గిరిజన రెబ్బెన మండల అద్యక్షుడు శ్రీనివాస్ ,ఇప్ప భీమయ్య రాజు సురేందర్ తదితరులు పాల్గొన్నారు 




















వసతులు లేని ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలి

వసతులు లేని ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలి 

ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ 

జిల్లా వ్యాప్తంగా గ ఉన్న  ప్రైవేటు కళాశాలలు,పాఠశాలలో కనీస వసతులు లేవని అటువంటి వాటిని గుర్తించి గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేసారు ఈ సందర్భంగా  కే . ఎల్ . మహేంద్ర భవన్ లో మాట్లాడుతూ తెలంగాణాపా ఠశాలల విద్యశాఖా  రాష్ట్ర వ్యాప్తంగా తనిఖిలులు నిర్వహించడాన్ని ఎ ఐ ఎస్ ఎఫ్ స్వాగతిస్తున్న మని అధికారులు తనిఖీలు నిర్వహించలని అన్నారు  జిల్లా వ్యాప్తంగా గ ఉన్నఅనేక ప్రైవేటు కళాశాలలు పా ఠశాలలు కొనసాగుతున్నాయని వాటిని గుర్తించి రద్దు చేయాలనీ అన్నారు మంచిర్యాల బెల్లంపల్లి ఆదిలాబాద్ నిర్మల్ కాగజ్  నగర్  ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు కళాశాలలు షాపింగ్ కాంప్లెక్స్ లలో  కొనసాగిస్తున్నారని కనీసం మరుగుదొడ్లు ఆట స్తలం ఆర్హత కలిగిన ఊపద్యయులు లేకుండా నడిపిస్తున్నారని అన్నారు ధనార్జనే ద్వేయంగా ఇప్పటికి కొన్ని పాఠశాలలు కళాశాలలు రంగు రంగుల కరపత్రాలు ముద్రించి ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలు చర్యలు తీసుకోకుండా విద్యశాఖ   అధికారులు యాజమాన్యాలు కొమ్ముకాస్తున్నారని అన్నారు ప్రీ ప్రైమరీ విద్యనూ అనుమతి తీసుకోవాల్సి ఉండగా పలు పా ఠశాలలు అనుమతి తీసుకోకుండా నిర్వహిస్తున్నారని అన్నారు తప్పుడు ప్రచారాలు నిర్వహించే విద్యాసంస్థలు అడ్డుకుంటామని హెచ్చరించారు ఇప్పటికికైన విద్యాశాఖ అధికారులు కనీస వసతులు లేకుండా స్వంత భావనలు లేకుండా ఆటస్తలం లేకుండా ఉన్నటువంటి పాఠాశాలలు కలాశాలల గుర్తింపు రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు  ఈ కార్యక్రమంలో   ఎ ఐ ఎస్ ఎఫ్ మండల అద్యక్షులు రవికుమార్ ,కార్యదర్శి సాయి మహిపాల్ శేకర్ రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు 

Tuesday, 12 April 2016

మండుతున్న బానుడు అల్లాడుతున్న ప్రజలు


                      మండుతున్న బానుడు అల్లాడుతున్న ప్రజలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ఎండలు రోజు రోజుకి పెరగటం వలన ప్రజలు మద్యాహం పూట బయటకు రావాలంటే బయపడుతున్నారు . వరుసగా పెరిగుతున్న ఉష్నోగ్రతలకు రెబ్బెన మండల  ప్రజలు బెంబలెత్తి పోతున్నారు.  ఎండ సెగకు  రోడ్లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి . ఏప్రిల్ లోనే పరిస్టితి ఇ లా ఉందంటే  ఇంకా ముందు ముందు తీవ్రత ఎంత మెర ఉంటుందోనని  ప్రజలు అందోళనతో  ఎండలు బాబోయి ఎండలు అని గగ్గోలు పెడుతున్నారు. ఇదే పరిస్థితి కోనసాగితే ప్రజలకు నీటి సమస్య తలెత్తి నానాఇబ్బందులకు గురి కాకతప్పదు.  ఉదయం 10 గంటలు దాటితేనే రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత కొన్ని  రోజులుగా ఎండతీవ్రత పెరిగిపోవడంతో వృద్దులు పిల్లలు బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు.అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని భయాందోలనకు గురవుతున్నారు. ఎండ తీవ్రతకు ప్రజలు రోజువారి పనులకు వెళ్ళాలంటే జంకుతున్నారు  బానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.  





రెబ్బెన తపాల కార్యాలయాన్ని తనిఖి చేసినా ఉన్నత అధికారి

రెబ్బెన తపాల కార్యాలయాన్ని తనిఖి  చేసినా  ఉన్నత  అధికారి  

 (రెబ్బెన వుదయం ప్రతినిధి)  తపాలా ఉన్నత  అధికారి సబ్ డివిజనల్ ఐ.పి.ఓ నోకేతో రేస్తో   మంగళవారం  రెబ్బెన తపాలా కార్యాలయన్ని   తనిఖీ  చేశారు.  తపాల కేంద్రంలో రిజిస్టర్ లను పరిశీలించి సరైన  కాలంలో ఉద్యోగులు హాజరు కావాలని అన్నారు.  అదేవిధముగా ఉత్తరాలు ప్రజలకు సకాలంలో అందే విధముగా చూడాలని అన్నారు.  ముఖ్యముగా ఉపాధి కూలీలకు కూపనులను జాగ్రత్తగా పరిశీలింఛి ఇబ్బంది  జరగకుండా చూడాలని అన్నారు. ఈయనతో పాటు సబ్ పోస్ట్ మాస్టర్ సదాశివ్ , సిబ్బంది స్వామీ , కిరణ్ కుమార్ లు ఉన్నారు

Monday, 11 April 2016

ఘనముగా మహాత్మ జ్యోతిబా ఫూలే 190వ జయంతి వేడుకలు

           
                ఘనముగా మహాత్మ జ్యోతిబా ఫూలే 190వ జయంతి వేడుకలు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) భారతమాత ముద్దబిడ్డ, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మజ్యోతిబాఫూలే అని ఆయన  చేసిన సేవలు చిరస్మరణీమని  రెబ్బెన ఎం పి పి కర్నాథం సంజీవ్ కుమార్ అన్నారు. సోమవారం  రెబ్బెన అతిధి గృహంలో   మహాత్మ జ్యోతిబా ఫూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ   అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పిస్తూ, నిరుపేద బడుగుబనహీన వర్గాల కోసం జీవితమంతా ఒంటిరిగా పోరాడిన మహావ్యక్తి ఫూలే అని కొనియాడారు. .ఈ కార్యాలయములో టి ఆర్ ఎస్ జిల్లా ఉపాధ్యాక్షుడు నవీన్ జైస్వాల్ కుమార్ , బి సి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ , ఎం పి  పి  సంజీవ్ కుమార్ , తది  తరులు ఉన్నారు.  

ప్రమాదంలో ప్రజలు - పట్టించుకోని విద్యుతు అధికారులు

  ప్రమాదంలో ప్రజలు - పట్టించుకోని విద్యుతు అధికారులు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలోని గొల్లగూడెం గ్రామంలో దారికి అడ్డంగా  ట్రాన్స్ ఫారముతో  కూడిన విద్యుత్ స్తంభము  వైర్లు కిందకు వేలాడుతూ వున్నాయి. ఆ విద్యుత్  కరెంట్ తీగల  వల్ల పశువులు, చిన్న పిల్లలు అ  దారికి వెళ్ళేటపుడు ఎప్పుడు ఎ ప్రమాదము ముంచుకొస్తుందో నని ప్రజలు భయా భ్రాన్తులకు గురి అవుతున్నారు. కరెంట్ ట్రాన్స్ ఫారముతో  కూడిన విద్యుత్ స్తంభము వైర్లు కిందకి వేలాడుతున్నాయని, చిన్న పిల్లలకు సైతం అందేలా వున్నయిని ప్రజలు భయపడుతున్నారు . విద్యుత్ అధికారులతో  మొరపెట్టుకున్న పట్టించుకోవడము లేదని  గ్రామస్తులు అంటున్నారు.  ఇటివల కాలంలో  విద్యుతు వైర్ల వలన చాలా ప్రమాదాలు జరిగాయి  కాని ఇది అధికార్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనబడుతున్నదని  గ్రామ  వాసులు అంటున్నారు . ఇప్పటికైనా  ఉన్నత అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని , విద్యుతు స్తంభం వైర్లు వేలాడ కుండా చేయాలనీ,  స్తంభం  చుట్టూ కంచె వేయాలని ప్రజలు కోరుతున్నారు.  

కె జి నుంచి పి జి వరకు ఉచిత విద్యను అమలు చేయాలి - ఎ ఐ ఎస్ ఫ్ నాయకులు

కె జి నుంచి పి జి వరకు ఉచిత  విద్యను అమలు చేయాలి -
ఎ ఐ ఎస్ ఫ్ నాయకులు

(రెబ్బెన వుదయం ప్రతినిధి) కె.జి నుంచి పి.జి వరకు ఉచిత విద్యను  ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయాలనీ ఎ ఐ ఎస్ ఫ్  అధ్వర్యంలో రెబ్బెన మండలం తహసిల్దార్ కార్యాలయం ముట్టడి చేశారు అనంతరం తహసిల్దార్ కి వినతి పత్రం అందచేశారు  ఈ సందర్బముగా  ఎ ఐ ఎస్ ఫ్  మండల కార్యదర్శి పూదారి సాయి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విద్య విదానాన్ని నిర్లక్షం చేస్తందని అన్నారు. బేషరతుగా ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేయాలనీ, మోళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణిలో రాష్ట ప్రభుత్వం  పూర్తిగా విఫలం అయిందని ఎద్దెవ  చేశారు. పెండింగ్ లో వున్నా స్కాలర్ షిప్ , ఫీజు రియంబర్స్ మెంట్ లను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.  ఈ విద్య సంవత్సరంలో పాఠ్య పుస్తకాలు సకాలంలో అందచేయాలని లేని పక్షంలో ఎ ఐ ఎస్ ఫ్ అధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ ఉపాధ్యక్షులు వీమునూరి శేఖర్ , మలిశెట్టి మహిపాల్ , నారాయణపూర్ గ్రామ అధ్యక్షుడు ఆత్రం శ్యాం రావు, ఎ ఐ టి యు సి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య , పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 

Saturday, 9 April 2016

ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోండి


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి)  ఆయుర్వేద మందుల ద్వారా ఆరోగ్యం త్వరగా నయమవుతుందని బెల్లంపల్లి ఏరియ డీవై జీఎం చిత్తరంజన్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో హైదరాబాద్ లోని మాతా రిసెర్చ్ సెంటర్ డా,విశ్వనాథ మహార్షి వారు 10వ తేది ఉదయం 10 గం,ల నుండి మధ్యాహ్నము 1 వరకు ఆయుర్వేద వైద్య శిభిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అలాగే సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు మాదారం టౌన్ షిప్ లో  నిర్వహిస్తున్నారని అన్నారు  ఈ వైద్య శిభిరంలో దీర్ఘ కాలిక వ్యాదులైన కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, పక్షవాతం, మలబద్దకము, అస్తమా, స్త్రీ ల వ్యాధుల గురించి పరిక్షించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఘనముగా చండ్ర రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి

 ఘనముగా చండ్ర రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లోని కె . ల్ మహేంద్ర భవన్ లో శనివారం రోజున చండ్ర  రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి అఖిల భారత యువజన సమాఖ్య ఎ ఐ వై  ఫ్  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎ ఐ స్ ఫ్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్బముగా  ఎ ఐ వై  ఫ్ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ ,  ఎ ఐ స్ ఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వర్ రావు భారత కమ్యునిస్టు పార్టీ కి ఎనలేని సేవలు చేశారు ముఖ్యముగా బడుగు బలహీన వర్గాల అబ్యునతి కోసం పేద ప్రజల హక్కుల కోసం,ఎన్నో పోరాటాలు చేశారు 1959 మే , 31 న ఎ ఐ వై  ఫ్ ని అవిర్బవించాడని నాటి  నుంచి ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు అందరు యువతి యువకులు విద్యార్థులు చండ్ర రాజేశ్వర్ రావు ఆశయాలకు అనుగుణముగా ఉద్యమాలు చేశారని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎ ఐ వై  ఫ్ మండల ఉపాధ్యక్షుడు మలిశెట్టి మహిపాల్ , పారిపండ్ల  రమేష్ , దుంపల బాపు , చంద్రయ్య ,  రవి , తదితరులు పాల్గొన్నారు .