ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని మత్స సహకార సంఘం చైర్మెన్ పోలు లక్మన్ ముదిరాజ్ అన్నారు శుక్రవారం రెబ్బెన మండలంలోని అతిధి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని అన్నారు మత్స కారులకు సబ్సిడీ రుణ సదుపాయం,భీమా పథకం వర్తిస్తుంది అని అన్నారు ఉపాధి పనులు కల్పించాలని అన్నారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో చేపల పెంపకాన్ని పెంచవచ్చు అని, ముదిరాజ్ సంఘం ద్వారా ఉపాధి పొందవచ్చునని అన్నారు రెబ్బెన లో ముదిరాజ్ నూతన కమిటీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజమల్లు ముదిరాజ్ ,రెబ్బెన మండల అధ్యక్షుడు పెసారు మధునయ్య ముదిరాజ్ ,కార్యదర్శి పిల్లి మధు ముదిరాజ్ ,చిత్రగుప్తుడు, కాలివేణి రాజెందర్ ముదిరాజ్, సర్పంచ్ పెసారు వెంకటమ్మ ముదిరాజ్,మూడెడ్ల శ్రీనివాస్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment