Tuesday, 14 June 2016

అధికారులు చిత్త శుద్దితో పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం- ఎంఎల్ సి


      అధికారులు చిత్త శుద్దితో పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం- ఎంఎల్ సి 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  అధికారులు ప్రజా ప్రతినిధులు వారివారి విదులలలో విధి నిర్వహణ చిత్త శుద్దితో పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం అని ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్  అన్నారు రెబ్బెన మండలంలో ఎం పి  డి ఓ కార్యాలయంలో  ఎం పి పి సంజీవ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసినా సర్వ సభ్యసమావేశంలో  ముఖ్య అతిధిగా ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్,  ఎం ఎల్ ఎ  కోవ లక్ష్మి సమావేశంలో మాట్లాడరు. అన్ని శాఖల అధికారుల అబివృద్ది పనులపై చర్చలు జరిపి సంక్షేమ పథకలను ప్రజలకు జారి చేసి వాటిని సక్రముగా ప్రజలకు అందేలా చూడాలని అధికారులను కోరారు ముఖ్యంగా విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలని, రానున్న వర్షాకాలం దృష్టిలో వుంచుకొని అధికారులు వారి యొక్క పరి సరాలలో  పరిశుద్ధం లేకుండా చూడాలి నీళ్ళు  కాలుషితం కాకుండా చూడాలి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా విద్య రంగంలో   100 % ముందంజ లో వుండాలని ప్రతి ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులపై శ్రద్ధ చూపి ముందంజ లో ఉత్తిర్ణ స్తాయిని పెంచాలని అ శాఖ అధికారులకు అదేశలను జారి చేసారు రైతులకు సకాలంలో ఎరువులు ,విత్తనాలు అందచేయాలి అన్నారు మరియు హరిత హారం  కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చెట్లను నాటేల చూడాలని,అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన షాదీ ముభారాక్,కళ్యాణి లక్ష్మి,మిషన్ కాకతీయ,పించన్ వంటి పథకాలు  అర్హులైన వారికీ సక్రమంగాఅందేలా చూడాలని,స్వచ్చ బారత్ లో బాగముగా ప్రతి ఇంటికి మరుగు దొడ్డి నిర్మించాలి మన ఊరు మన ప్రణాళిక ఆదరముగా మన రాష్ట్రము చేపట్టిన సంక్షేమ పతకాలను ప్రజలకు ప్రవేశ పెడుతూ మన ముఖ్య మంత్రి కె చంద్రశేఖర్  రావు అధికరులతో స్నేహ భావంతోఫ్రెండ్లీ  గవర్నమెంట్ సంక్షేమ పథకాలను జారి చేస్తున్నాయి రానున్న భావి తరాలలో బంగారు తెలంగాణ పాలన ఎకదాటిగా కొనసాగుతుంది అని అన్నారు. ఈ సర్వ సభ్య సమావేశము  ఉదయం 11.30ని "జరగాల్సి ఉండగా సాయంత్రం ప్రారంభం కావడంతో  కొంత మంది ప్రజా ప్రతినిధులు వేనుదిరుగాడంతో సదవుగా ముగిసింది.   ఈ సభలో   జ డ్ పి టి సి  బాబురావు, వైస్ ఎం పి పి  గోడిసేలా రేణుక,  తహసిల్దార్ రమేష గౌడ్ ,ఎం పి డి ఓ లక్ష్మినరయణ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటి చేర్ మేన్ గందం శ్రీనివాస్,ఎం ఇ ఓ వెంకటేశ్వర స్వామి,   ఎ పి ఎమ్ రాజ్ కుమార్,వెంకటరమణ ఎ ఓ మంజుల, ఎ పి ఓ కల్పనా,సి డి పి ఓ మమత ,ఈ ఓ పి అర్ డి కిరణ్ ,అర్ డబ్లు జె ఎస్ సోని,రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ,వివిధ  గ్రామాల సర్పంచులు ఎం పి టి సి లు అధికారులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment