Sunday, 12 June 2016

మార్కేట్ వైస్ ప్రెసిడెంట్ గా కుందారపు శంకరమ్మ

 మార్కేట్ వైస్ ప్రెసిడెంట్ గా కుందారపు శంకరమ్మ 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణా  రాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులలో వైస్ చైర్మన్ గా రెబ్బెన మండలానికి  చెందినా కుందారపు శంకరమ్మ ఎన్నికయ్యారు.2002లో సి పి ఐ పార్టీ లోంచి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమాలలో పాల్గొని కీలకపాత్ర పోషించారు.2002 నుంచి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శిగా కొనసాగుతూ 2008లో తూర్పు జిల్లా మహిళా ప్రధాన  కార్యదర్శిగా నియామకం అయ్యారు.బి సి కులసంఘం లో జిల్లా మహిళా ఉపద్యాక్షురాలుగా కొనసాగుతూ పేద ప్రజలకు సంక్షేమ పతకాలను తెలియ జేస్తూ చేదోడు వాదోడు గా పనిచేస్తున్నారు.కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం కోసం చురుకుగా పనిచేస్తున్నందుకు  గుర్తించి మార్కేట్ వైస్ ప్రెసిడెంట్ గా పదవిని ప్రకటించడం ఎంతో సంతోషకరమని అన్నారు.ఈ సందర్భంగా  .యంఎల్ఎ కోవాలక్ష్మి, యం యల్ సి పురాణం సతీష్ ,మంత్రులకు మరియు కె సి ఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

No comments:

Post a Comment