పర్యావరణాన్ని మరియు వన్యప్రానులను కాపాడుదాం జి .ఎమ్ రవిశంకర్
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గోలేటి జి. ఎమ్ కార్యాలయం లో సోమవారం నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రపంచ పర్యావరణ రక్షణ దేశాల సమితి వన్యప్రాణుల సంరక్షణ విషయం లో కఠినంగ వవ్యహరిద్దాం అన్న ముఖ్య ఉద్దేశ్యాని మరియు వన్యప్రాణుల అక్రమ వాణిజ్యాని అరికడదాం అనే నినాదాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రకటించారని తెలియజేశారు. ఈ సందర్బంగా ఏరియ జెనరల్ మేనేజర్ రవిశంకర్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ ప్రతిఒకరి బాద్యత అని వన్యప్రాణుల చర్మం, కొమ్ములు, దంతాలు, గోళ్ళు , ఇతరత్రా అక్రమ వ్యాపార నిమితం ఏనుగులు, పులులు , జింకలు , ఖడ్గమృగం, ఇతర వన్యప్రానులను చంపటాని మానవాళి ముక్తకంఠం తో వ్యతిరేకించాలని తెలిపారు. ఈ సందర్బంగా గోలేటి, మాదారం, తాండూర్, రెబ్బెన, గంగాపూర్, నంబాల తదితర గ్రామాలలోని విద్యార్దులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం, క్విజ్ పోటీలను నిర్వహించి ఈ పోటిలలో గెలుపొందినవారికి బహుమతులు అందజేస్తాం అని తెలిపారు.
No comments:
Post a Comment