Thursday, 30 June 2016

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కి బి సి సంఘ మహిళల ఘన సన్మానం

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కి బి సి సంఘ మహిళల ఘన సన్మానం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  బి సి సంఘం ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ మార్కెట్  కమిటీ వైస్ చైర్మన్ గా పదవి పొందిన సందర్బంగా బుధవారం ఆమె స్వగృహంలో  బి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు  ఇ. సువర్ణ ,కోశాధికారి ఎ.చంద్రకళ ఆమెను ఘనంగా సన్మానించారు.మహిళలు అందరూ రాజకీయంగా ఎదగాలని,అన్ని రంగాలలో చైతన్య వంతులు కావాలని జిల్లా అధ్యక్షురాలు ఇ. సువర్ణ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో పి.సుగుణ, పి.రజిత ,పి.లత , పార్వతి ,పోషయ్య ,చంద్రగిరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కె.శంకరమ్మ మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,నా పదవికి న్యాయం చేకూరుస్తానని తెలిపారు.         

No comments:

Post a Comment