మరుగు దొడ్ల బిల్లులు చెల్లించంచండి ఏ ఐ వై ఎఫ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన
మండలములోని 12 గ్రామ పంచాయతీలో ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నా అధికారులు బిల్లులు చెల్లించడము లేదని ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యాయుడు బోగే ఉపేందర్ అన్నారు . సోమవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయములో డిప్యూటీ తహసీల్ధార్కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు అనంతరము మాట్లాడుతూ లబ్ది దారులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాన్ని ప్రభుత్వ అధికారులు నీరుగారుస్తున్నారని తెలిపారు . గతం లో అప్పులు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నా వారికి కూడా బిల్లులు రాలేదని అన్నారు ., గత 3 నెలలనుండి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావడము లేదని , దీనితో కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు . మరుగు దొడ్ల బిల్లులు , ఉపాధి కూలీలు డబ్బులు వెంటనే చెల్లించే విదంగా సంబంచిన అధికారులు చూడాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు రాయిలా నర్సయ్య , నీలగిరి రాజు , రామడుగుల శంకర్ లు ఉన్నారు . .
No comments:
Post a Comment