ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో గోలేటిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా ఈ నెల 17నుండి శిక్షణ తరగతులు ప్రారంబించి 21న ముగింపు కార్యక్రమం లో జియం కార్యాలయము నుండి టూ కె రన్ ప్రధాన రహదారుల గుండా సింగరేణి క్రీడా మైదానం వరకు పరుగులు తీశారు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కె రవిశంకర్ మాట్లాడారు. అందరు యోగతో సంపూర్ణ ఆరోగ్యమును మెరుగు పరచుకోవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు అదేవిధంగా యోగ గురువులు శ్రీ కృష్ణ మూర్తి మాట్లాడుతూ రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఉన్నత లక్షలను చేరాలని తెలిపారు . ఈ యోగ కార్యక్రమంలో శిక్షకురాలు శ్రీమతి దేవేంద్ర యోగ కార్యకర్తలు అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య, పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్, .ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి జి.ఎం. కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment