ప్రభుత్వ జూనియర్ కాలేజీ నూతన భవనం ప్రారంభించాలి -- ఎస్ ఎఫ్ ఐ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నూతన భవనం నిర్మాణం పూర్తి అయింది కానీ తరగతులు జరగడం లేదని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు గుడిసెల కార్తిక్ అన్నారు రెబ్బెనలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాలేజీ భవనం పూర్తి అయినా తరగతులు ప్రారభించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు అని కాలేజీ మరియు స్కూల్ తరగతులు ఒకే చోట జరగడం వల్ల అరాకొరా చదువులతో విసిగి పోతున్నారు కావున ఉన్నంత అధికారులు గమనించి కాలేజీ నూతన భవనం ప్రారంభించాలని కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి త్రాగు నీటి సదుపాయం కల్పించాలని కోరారు ఈ సమావేశం లో ఎస్ ఎఫ్ ఐ డివిజనల్ ఉపాధ్యక్షుడు ప్రేమ్ సాగర్, ఎస్ ఎఫ్ ఐ డివిజినల్ సభ్యుడు అశోక్ వున్నారు.
No comments:
Post a Comment