పర్యావరణం కాపాడుదాం వన్యప్రాణుల సంరక్షిధాం ; జి ఏం రవిశంకర్
(రెబ్బెనవుదయంప్రతినిధి) వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వన్య ప్రాణుల అవయవాల అక్రమ నిమిత్తం వన్య ప్రాణులను చంపడాన్ని ప్రపంచ మానవాళి ముక్తకంఠంతో వ్యతిరేకించాలి అని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కె రవిశంకర్ అన్నారు. సోమవారం రోజున రెబ్బెన మండలం గోలేటి లో జనరల్ మేనేజర్ కార్యాలయం నుంచి గోలేటి ప్రధాన రహదారుల గుండా ప్రజలకు పర్యావరణ సంరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి వన్య ప్రాణుల సంరక్షణ విషయంలో కఠినముగా వ్యవహరిద్దాం అనే విషయాన్ని మరియు వన్యప్రాణుల అక్రమ వాణిజ్యాన్ని అరికడతాం అనే నినాదాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భముగా ప్రకటించారని తెలియచేసారు బెల్లంపల్లి ఏరియా సింగరేణి సంబందించిన ఖాళీ స్థలాలలో, కాలనీలలో గనులలో 2016 సంవత్సరానికి 177హెక్టార్ల స్థలంలో 4,42,500 ల మొక్కలు నిర్దేశించినట్టు తెలిపారు 2015 లో 151 హెక్టార్ల మొక్కలు నటినట్లు తెలిపారు ప్రతి ఒక్కరు అడవులను సంరక్షించుకుంటూ ఖాళీ ప్రదేశాలలో ,ఇళ్లలో ,స్కూళ్లలో ,ఆఫీసులలో ,రహదారుల వెంబడి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని అన్నారు ఈ పర్యావరణ ర్యాలీలో కార్మికులు,సింగరేణి సేవా సభ్యులు సింగరేణి ఉన్నత పాఠశాల గోలేటి ,సెయింట్ ఆగ్నెస్ స్కూల్ పిల్లలు,ఎస్ ఓ టు జి ఎమ్ కొండయ్య, సదాశివ్, తిరుపతి ఏఐటీయూసీ ,స్కూల్ టీచర్స్ ,పర్యావరణ అధికారి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment