ఉపాది కులిల డబ్బులు వసూలు చేస్తున్న బి పి ఎం లు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); కూలీల దగ్గరి నుండి బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్] ఉపాది హామీ కులిలకు వేతనాలు చేల్లిన్చేటప్పుడు 10 రూపాయలనుండి 50 రూపాయల వరకు అదనంగా వసులు చేస్తున్నారని తపాలా కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి పోస్ట్ మాస్టర్ ఎస్ స్వామి కి వినపతి పత్రం అందించి అనతరం కూలీలు మాట్లాడుతూ వారం వారం వేతనాలు చేల్లిన్చేటప్పుడు బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్] లు కూలిల దగ్గరి నుండి పైన మిగిలిన చిల్లర 10 నుండి 50 వరకు రూపాయలు తీసుకుంటున్నారు మరియు గ్రామంలో వున్నా కూలీలకు వారి గ్రామాలలో ఇవ్వాల్సి వుండగా మండల కేంద్రంలో వారి ఇంటి వద్ద ఇస్తున్నారు వేతనం తీసుకోవడానికి కూలీలు వారి రోజువారి వేతనం పోగొట్టుకొని మండుటెండలో మండల కేంద్రం లోని వారి ఇంటి వద్దకు వచ్చి తీసుకోవలసి వస్తుందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి దుస్తితి పురనవ్రుతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ కూలీలు గ్రామపంచయితికి వెళ్లి వారి బాధను మొరపెట్టుకోగా సర్పంచ్ పెసరి వెంకటమ్మ ,సింగిల్ విండో డైరెక్టార్ మదునయ్య లు వెళ్లి తపాలా అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో లవుడ్య రమేష్ , బోడిగేల నీరజ, నగేష్ ,శారద, నిత,లలిత ,అమృత , శంకరమ్మ , బాగ్య ,సునిత ,మల్లేష్ ,గీసుకొండ రమేష్ ,లక్ష్మి ,సావిత్రి రాజేశ్వరి, తదితర కూలీలు పాల్గొన్నారు
No comments:
Post a Comment