Thursday, 9 June 2016

ప్రేమ పేరుతో వేధిస్తున్నా యువకు డు అరెస్ట్

ప్రేమ పేరుతో వేధిస్తున్నా యువకు డు అరెస్ట్


(రెబ్బెన వుదయం ప్రతినిధి);;  ప్రేమ పేరుతో గత కొంత కాలంగా చరవాణిలో అసభ్యకరమైన పదజాలంతో సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడని యువతీ ఫిర్యాదు చేసిందని ఎస్సై టీవీ రావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెన మండలంలోని తుంగేడ గ్రామానికి చెందిన మాదాసు కమలాకర్ రెబ్బెనకు చెందిన యువతీ యొక్క అన్నతో గత కొద్ది కాలంగా స్నేహం పెంచుకొని తన సోదరిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో చరవాణిలో అసభ్యకరమైన పదజాలంతో సందేశాలు పంపుతూ తనను ప్రేమించానంటూ మానసికంగా వేధిస్తున్నాడని యువతీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గురువారం కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment