క్రీడ మైదానం ఏర్పాటు చేయాలనీ తహసిల్దార్ కి వినతి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); క్రీడ మైదానం ఏర్పాటు చేయాలనీ రెబ్బెన యువకులు బుదవారం రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ కి వినతి పత్రం అందచేసారు అనంతరం ఎన్ ఐ ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం బరద్వాజ్ మాట్లాడుతూ రెబ్బెన లో క్రీడ మైదానం లేక యువకులు అన్ని రంగాలలో వెనుక పడి పోతున్నారని,తప్పకుండ రెబ్బెన లో క్రీడ మైదానం ఏర్పాటు చేయాలనీ అన్నారు యువతి యువకులు ఫీట్ నెస్ కోసం క్రీడ మైదానం లేక జాతీయ రహదారి వెంట నడవాల్సిన దుస్తుతి ఏర్పడిందని, గతంలో రహదారి వెంట ఉదయం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు గుర్తు తెలియని వాహనం డీకొని ఒక వృద్దుడు చనిపోవడం జరిగిందని అని అన్నారు. ఇలాంటి దుస్థితి ఏర్పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసిల్దార్ స్పందించి క్రీడ మైదానం కొరకు రెబ్బెన పరిది లో సర్వే చేయించి ప్రభుత్వ భూమిని కేటాయించేలా అర్.ఐ అశోక్ చౌవాన్, వి,అర్,ఓ హుమ్లాల్ కు ఆదేశాలను జారి చేశారు ఈ కార్యక్రమంలో పాపయ్య, వినయ్, శ్రీనివాస్, కార్తీక్, కీర్తి మహేందర్ జమీర్ అన్వర్ సంతోష్ తదితరులు వున్నారు
No comments:
Post a Comment