విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎలక్షన్స్ లకు ఏర్పాట్ల సమీక్ష
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో ఎలక్షన్ లు సక్రమం గా జరగాలని రెబ్బెన మండల తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ కార్యాలయం లో ఐటిడిఏ,వి.ఆర్.ఓ ఏర్పాటు చేసిన అధికారుల సమావేశం లో మాట్లాడారు. ఈ శనివారం 25 వ తేదీన విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ ల కోసం ఎలక్షన్స్ మండలం లోని 11ఏజెన్సీ గ్రామలలో జరుగుతాయని, వీరిలో ప్రెసిడెంట్ గా గ్రామ సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ టి వర్గానికి చెందిన స్రి పురుషా అభ్యర్థులు, సెక్రెటరీ గా డ్వాక్రా మహిళా సంఘాల నుండి ఎస్ టి వర్గానికి చెందిన మహిళా అభ్యర్థులను ఎన్నిక జరుగుతుందని అన్నారు. ఇందుకు ఆసక్తి కలిగిన 18సం,, నిండి ఓటు హక్కు కలిగి ఎస్ టి వర్గానికి చెందిన స్రి పురుషా అభ్యర్థులు ఆయా ఏజెన్సీ గ్రామలలో హాజరు కావాలని కోరారు. ఈ సమావేశం లో ఉప తహసీల్దార్ రామ్మోహనరావు, ఐటిడిఏ ఏపియం వెంకటరమణ, హన్మంతరావు, తిరుపతి , శంకర్, ఆర్ఐ అశోక్, వి.ఆర్.ఓ పంచాయతీ కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment