ప్రభూత్వ పాఠశాల భవనాలు నిర్మాణాలపై అవినీతికి పాలుపడుతున్నా కాంట్రాక్టర్లు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని యంపీ యుపిఎస్ ప్రభూత్వ పాఠశాలలకు మంజూరైన ఆదానవు గదుల నిర్మాణపు కాంట్రాక్టర్లు లు అవినీతికి పాలుపడుతున్నారని అఖిల భారత ప్రజా తంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలేటి నాగేష్ ఒక పత్రిక ప్రకటన లో తెలిపారు భవనాలు మే నెలలో పూర్తి చేయాల్సి ఉండగా రాజకీయ నాయకుల అండదండలతో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాలుపడడం వలన నిర్మాణం పనులు ప్రారంభంలోనే ఆగిపోయాయని నిధులు మంజూరైన కూడా నిర్లక్ష ధోరణితో పనులను ఆపివేయడం తో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు . అక్రమ కాంట్రాక్టర్ల లైసెన్స్ లు రద్దుచేయాలని కోరారు . ఒకప్రక్క బడిబాట కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులపై దృష్టి కేంద్రికరించి విద్యార్థుల సమష్యలను పరిష్కరించాలని అఖిల భారత ప్రజా తంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలేటి నాగేష్ డిమాండ్ చేశారు
No comments:
Post a Comment