Tuesday, 21 June 2016

రోడ్డు ప్రమాదం లో బాలుడి మృతి

రోడ్డు ప్రమాదం లో బాలుడి మృతి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం లో మంచిర్యాల కు చెందిన ఎండి . యూనుస్  మృతి చెందాడు. రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల కు చెందిన ఖాలిద్ కుటుంబ సభ్యులతో శనివారం కాగజ్ నగర్ బంధువుల ఇంటికి ఇఫ్తార్ విందుకు హాజరు కావడం జరిగింది రాత్రి అక్కడే పడుకుని తెల్లవారుజామున తన కుమారుడు ఎండి . యూనుస్ [6సం ] తో ఆటో ట్రాలీ లో ఏ పి 01డబ్లు  9409 మంచిర్యాల బయలు దేరడం జరిగింది రెబ్బెన బస్టాండ్ దాటి కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుకగా వచ్చిన లారీ ఏ పి 07టి సి  6219 వేగంగా ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది ప్రయాణిస్తున్న బాలుడికి తల ,చాతి  లో తీవ్ర గాయాలు కాగా బెల్లంపల్లి లోని చికిత్స కేంద్రానికి తరలించారు బాలుని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలపడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రెబ్బెన ఎస్ ఐ   దారం సురేష్ తెలిపారు.

No comments:

Post a Comment