Sunday, 19 June 2016

రెండవ రోజుకు చేరిన యోగా శిక్షణ తరగతులు

రెండవ రోజుకు చేరిన యోగా శిక్షణ తరగతులు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సింగరేణి పాఠశాల రెబ్బెన మండలంలో గోలేటిలో యోగా అంతర్జాతీయ దినోత్సవము సందర్భంగా శిక్షణ తరగతులు శనివారానికి రెండవ రోజు చేరుకున్నాయి  ఈ కార్యక్రమమునకు  బెల్లంపల్లి ఏరియా జనరల్  మేనేజర్ కె రవిశంకర్ విచ్చేసి విద్యార్థిని విద్యార్థులు అందరు యోగ శిక్షణ తరగతులకు హాజరై ఆరోగ్యమును మెరుగు పరచుకోవాలన్నారు ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు అదేవిధంగా యోగ గురువులు శ్రీ కృష్ణ మూర్తి మాట్లాడుతూ రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఉన్నత లక్షలను చేరాలని తెలిపారు . ఈ యోగ కార్యక్రమంలో శిక్షకురాలు శ్రీమతి దేవేంద్ర యోగ కార్యకర్తలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment