అధిక ఫిజులు వసులు చేస్తే ఉరుకొం ; విద్యార్థి వామ పాక్ష నాయకులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో వామ పాక్ష విద్యార్థి నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు రెబ్బెన మండలంలో గోలేటి కె ఎల్ మహేంద్ర భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు కార్తిక్ ఆధ్వర్యంలో వామ పాక్ష నాయకులు దుర్గం రవీందర్ ఏ ఐ ఎస్ ఎఫ్, కడతల సాయి టి వి వి, పాపారావు పి డి ఎస్ యూ, నగేష్ ఏ ఐ ఎఫ్ డి ఎస్, ఆత్మకూరి ప్రశాంత్ ఏ ఐ ఎస్ ఎఫ్, క్రాంతి ఏ ఐ ఎస్ ఎఫ్ మాట్లాడారు ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ లకు అనుమతులను ఇస్తూ ప్రభుత్వ విద్యను దూరం చేస్తుంది అని అన్నారు ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఫిజుల పేరులతో వేలాది రూపాయలు వసులు చేస్తున్నారని అన్నారు మండల విద్యార్థి అదికారులు పరోక్షంగా ప్రైవేట్ పాఠశాలలకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను మరుగున పడేస్తున్నారు అన్ని విద్య సంస్థలలో ప్రభుత్వ ప్రచురించిన పుస్తకాలను మాత్రమే వాడాలి అని కోరారు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల సామాగ్రిలా పేరుతో అధిక ఫీజులను వసులు చేస్తుండగా సంబంధిత మండల విద్య అధికారి ఏ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోక పోవడం శోచనీయమన్నారు ఇప్పటికైనా ఉన్నత విద్య అధికారులు చర్యలు తీసుకోవాలి లేకపోతే విద్యార్థి వామ పాక్ష సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ సమావేశం లో కె సాయి,చరణ్ ,ప్రేమ్ సాగర్ ,అశోక్,పుదారి సాయి,కస్తూరి రవి ,మహిపాల్ ,శేఖర్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment