స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభం
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బనలో మండల స్థాయి క్రికెట్ క్రీడలను మంగళవారం ఎంపిపి ప్రారంభించారు. స్వర్గీయ బండారి ఫణికుమార్ స్మారక చిహ్నార్థం తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అధ్యక్షతన ఎంపిపి సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి బాబురావు మాట్లాడుతూ క్రీడాకారులు మరింతగా రాణించి ప్రతిభను కనబర్చాలని అన్నారు.స్వర్గీయ బండారి ఫణికుమార్ ఆత్మ శాంతిచాలని రెండు నిమిషాలు మౌనం పాటించి అనంతరం మాట్లాడారు యువకులు విద్యతో పాటు క్రీడా రంగంలో ఆశక్తి కనపరుస్తూ మండలాన్ని ముందంజలో ఉండేలా చూడాలన్నారు. తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ క్రీడా యువకులలో నా కుమారున్ని చూసుకుంటుంన్నానని అలాగే పేద విద్యార్థులకు పీజులు కడుతూ చేయూతనిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమములో సర్పంచు పెసరు వెంకటమ్మ , మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ , ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , తూర్పుజిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ , చిరంజీవి , పాపయ్య , శాంతి తదితర క్రీడా కారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment