ఆటోని డీకొన్న బోలోరో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని వంకులం గ్రామానికి చెందిన వృద్ధులు పెన్షన్, ఉపాది కూలి డబ్బులు తీసుకోవడానికి రెబ్బెనకు వస్తుండగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ముందు జాతీయ రహదారి పైన ఆటోని దాని వెనకాల వస్తున్న బోలోరా అతివేగముగా డి కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పిప్రే లక్ష్మన్ (75), తులసి బాయి (72) మరణిచినట్లు రెబ్బెన ఎస్ ఐ టి రావు తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం వంకులం నుంచి ఆటోలో వస్తుండగా పిప్రే లక్ష్మన్, తులసి భాయి, రేణుక, పేంటు, పోషం, సుమన్ రెబ్బెనకు వస్తుండగా పెన్షన్ ఉపాది కూలి డబ్బులకు వస్తుండగా వెనకలే అతివేగముగా వచ్చిన రెబ్బెన కు చెందినా బోలోరా ఆటోని వేగంగా డీకొనడంతో పిప్రే లక్ష్మన్, తులసి తీవ్ర గాయాలు కాగా పిప్రే లక్ష్మన్ ని 108లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు, తులసి బాయి చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment