Friday, 17 June 2016

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగా శిక్షణ తరగతులు

అంతర్జాతీయ యోగా దినోత్సవం  సందర్బంగా యోగా శిక్షణ తరగతులు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగేరేణి సి ఎం డి శ్రీధర్ ఆదేశాల మేరకు ఈనెల 17 నుండి 20 వరకు జరుగు యోగా తరగతులలో ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని రెబ్బెన మండలం గోలేటి జిఎమ్  కార్యాలయం లో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతుల  జిఎమ్ రవిశంకర్ పాల్గొని  మాట్లాడారు   ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా బెల్లంపల్లి డివిజన్ లోని అన్ని గనులలో ,పాఠశాలలలో ,కార్యాలయలలో డోర్లీ -1, డోర్లీ-2 ఉపరితలగనులలో  యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ శిక్షణ ద్వారా కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యోగా శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం కొండయ్య ,డి వై పి ఎం పర్సొనల్  చిత్రాంజన్  ,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు  

No comments:

Post a Comment