Tuesday 29 March 2016

టెలికాం మండల రిటైలర్ల కార్యవర్గ ఎన్నిక సమావేశం:

 టెలికాం మండల రిటైలర్ల కార్యవర్గ ఎన్నిక సమావేశం:


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలంలో  అన్ని టెలికాం  కంపెనీల  రిటైలర్ల ,సేల్స్ నిర్వాహకుల  సమావేశం సోమవారం రామాలయం లో  నిర్వహించుకున్నారు.  ఈ సమావేశంలో రెబ్బనమండలంలోని కమిటీ కార్యవర్గ ఎన్నిక జరిగింది. అద్యక్షుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ అన్ని టెలికాం కంపనిలవారు రిటైలర్లను చిన్నచుపు చుస్తున్నారని, కంపనిల టార్గెట్ కోసం డిస్త్త్రిబ్యుటర్ల ఫై ఒత్తిడితెచ్చి ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా ప్రీపేడ్ కనెక్షన్లు అమ్మి రిటైలర్ల డెమోల నుండి పంపిస్తున్నారు.   అలాగే రిటైల్  గా అమ్మే వారు ద్రువికరణపత్రాలు సరిచూసిన తర్వాతే  సిమ్ లు అమ్మాలని నిర్ణఇంచుకున్నారు.  టెలికాం  కంపెనీలు ఇచ్చే 2%కమిషన్ పెంచాలని, అప్లికేషన్ ఫారంలోఉన్న రిటైలర్ కాలాన్ని తీసివేయాలని, పోస్ట్ పైడ్ ఆక్టివేషన్లు ఏ పద్ధతిలో కనెక్షన్లు ఇస్తున్నారో అదే పద్దతిలో   కంపెనీ ఉద్యోగి కస్టమర్ల ద్రువికరణపత్రాలు సరిచూసి ప్రీపేడ్ కొత్త కనెక్షన్లు ఇవ్వాలి .కానీ అన్ని టెలికాం  కంపెనీలు   దీనికి విరుద్దంగా రిటైలర్లఫై భారం మోపి ,ఇచ్చే 5 నుండి -10రూపాయల కమిషన్లకు రిటైలర్లను  నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు . దీనిపై కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.  తీసుకున్న కనెక్షన్లు వినియోగదారులు ఉపయోగించకుండా ఇతరులకు ఇవ్వడంవల్ల సిమ్ పోయినపుడు బ్లాక్ చేయకుండా వుంచడంవల్ల, సిమ్ దొరికిన  వ్యక్తి మిస్యూస్ చేయడంవల్ల కేసులు నమోదు చేసి పోలీసులు రిటైలర్లను అరెస్ట్ చేస్తున్నారు.  కావున మండల ప్రజలందరూ ఇతరుల ద్రువికరణ పత్రాలతో సిమ్ లను  తీసుకోరాదని అన్నారు  ఎన్నికైన కార్యవర్గం సబ్యులు అద్యక్షుడు సునీల్ కుమార్ , ఉపాధ్యక్షులు కరుణాకర్ , సంతోష్ చారి, ప్రధాన కార్యదర్శి మల్లేష్ , కోశాదికారి హరీష్ , సంయుక్త కార్యదర్శి దుర్గం ప్రవీణ్ కుమార్ లను మండలం లోని అందరు రిటైలర్ లు కలిసి ఎన్నుకోవటం జరిగింది.  కమిటి సబ్యులు లఖన్  జైస్వాల్, భీమేశ్ , తిరుపతి , నరేష్, సతీష్. సలహాదారులు లోకేష్, సతీష్ గౌడ్, శంకర్, అనిల్, మొఈస్, రిటైలర్ల నరేష్,హరీష్ ,ఆజయ్  జైస్వాల్, పవన్, సంతోష్ లు పాల్గొన్నారు  

No comments:

Post a Comment