Thursday, 31 March 2016

కొండపల్లి లో సి సి రోడ్ ప్రారంభం

కొండపల్లి లో సి సి రోడ్ ప్రారంభం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలము లోని కొండపల్లి గ్రామములో సి సి రోడ్ ను రెబ్బెన ఎం పి  పి  కార్నాతం సంజీవ్ కుమార్ ప్రాంభించారు . ముందుగా భూమి పూజ చేసి కొబ్బరి కాయ కొట్టారు . ఈ రోడ్ కు 2 లక్షల 50 వేలు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు . ఈ కార్య క్రమములో టి ఆర్ ఎస్ మండల అధక్షుడు పోతూ శ్రీధర్ రెడ్డి , పి  ఆర్ జె ఈ జగన్నాథ్ , మాజీ సర్పంచ్ సంజీవ్ గౌడ్ ఉన్నారు .   

పదవి విరమణ ఒక అభ్డుత ఘట్టం -ఎస్ ఓ టు

పదవి విరమణ ఒక అభ్డుత ఘట్టం -ఎస్ ఓ టు  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  మనిషి జీవితం లో పదవి విరమణ  ఒక అబ్దుత ఘట్టమని ,  రామ లింగ రాజు  సుదీర్ఘంగా 40 సం "  సింగరేణి సంస్థ లో  ఎంతో కస్టపడి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిచారని బెల్లం పల్లి ఎస్ ఓ టు  జి ఎం కొండయ్య  అన్నారు . గురు వారము రెబ్బెన సింగరేణి కోల్ యార్డ్ లో రామలింగ రాజు పదవి విరమణ కార్య క్రమములో ముఖ్య అథిదిగా పాల్గొని మాట్లాడారు . సింగరేణిలో మామూలు ఉద్యోగము లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సంస్థకు ఎంతో సేవ చేస్తూ సంస్థ అభివృద్దికి తోడ్పడ్డాడని  చాల గర్వంగా ఉందని అన్నారు . ఆరోగ్యముగా ఉండి పదవి విరమణ పొందడము చాల సంతోషంగా ఉందని అన్నారు . రామ లింగ రాజు శేష జీవితము కుటుంభ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు . ఈ కార్య క్రమములో టి బి జి కె ఎస్ ఏరియ ఉపాధ్యాక్షుడు ఎన్ సదాశివ్ , ఎ ఐ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి  ఎస్ తిరుపతి , ఎస్ ఇ  విశ్వనాథ్ , ఇతర అధికార్లు , గ్లోబల్ కోల్డ్ యార్డ్ సబ్యులు హరి సంజీవ్ తదితర కార్మికులు ఉన్నారు .

గోలేటి భీమన్న స్డేడియంలో లాన్ టెన్నిస్ కోర్టు ఏర్పాటు

  గోలేటి భీమన్న స్డేడియంలో  లాన్ టెన్నిస్ కోర్టు  ఏర్పాటు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గోలేటి బిమన్న స్టేడియంలో లాన్ టెన్నిస్ కోర్టులో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఏరియ అధికారుల సమీక్షా సమావేశానికి డిరెక్టర్ ప్లానింగ్ ప్రాజెక్ట్ శ్రీ మనోహర్ రావు  ముఖ్య అధితిగా హాజరై అధికారుల ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యంగా రాబోయే కాలంలో కంపెనీ ముందన్న సవాళ్ళు ను అధికమించి 2015-16 అధిక సంవత్సరానికి నిర్దేశించి ఉత్పత్తి లక్ష్యాన్ని అధికరించడానికి ఏరియా అన్ని విభాగాల అధికారులు సమిష్టి కృషితో శ్రమించాలని పిలుపునిచ్చారు అలాగే ఈ  2015-16 అదిక సం''లో పూర్తి కాకముందే అడ్వాన్సు గ నిర్దేశించిన లక్ష్యాన్ని సాదించి సింగరేణి కంపెనీ లోనే లాభాలను గడిచినా రెండవ ఏరియా గా బెల్లంపల్లి ముందంజలో ఉందని ఈ విజయానికి కారకులైన జి ఎమ్  రవిశంకర్  నాయకత్వంలో పనిచేస్తున్న అధికారుల బృందానికి అభినందనలు తెలియ చేశారు.  ఇదే స్పూర్తి పట్టుదలతో రాబోయే కాలంలో ఉత్పత్తి ఉత్పాదకత మరియు రవాణా విషయంలో మెదటి స్థానంలో బెల్లంపల్లి నిలవాలని ప్రసగించారు ఈ కార్యక్రమంలో జి ఎమ్  రవీందర్ బెల్లంపల్లి గారు అధ్యక్షత న గెస్ట్ ఆఫ్ ఓనర్స్ గా మందమరి ఏరియా జి ఎమ్  వెంకటేశ్వర్ రెడ్డి శ్రీరాంపూర్ ఏరియా జి ఎమ్  ఎమ్  డి సంభది పాల్గొన్నారు. అలాగే ఏరియా అన్ని భాగాల అదిఅపతులు మరియు అధికారులతో పాటుగా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ,డి జి ఎమ్ పర్సనల్  చిత్తరంజన్ కుమార్ , మోహన్ రెడ్డి ,సంజీవ్ రెడ్డి, దేవేందర్ లు ,డి జీ  ఎమ్ సీతారం రావు, డి వై సి ఎమ్ ఓ అశోక్ , డి జీ  ఎమ్ రామకృష్ణ , డి జీ  ఎమ్ రామారావు ,డి జీ  ఎమ్ నర్సింగ  రెడ్డి తదితరులు పాల్గొన్నారు 



తెలుగుదేశం పార్టీ 34 వ ఆవిర్బావదినోత్సవ వేడుకలు

    తెలుగుదేశం పార్టీ  34 వ ఆవిర్బావదినోత్సవ  వేడుకలు     

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం నాడు రెబ్బెన మండల కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో ఎన్ టి అర్ విగ్రహానికి  పూల మాల వేసి 34 వ ఆవిర్బావ దినోత్సవాన్ని రెబ్బెన  మండల ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్  అధ్వర్యంలో ఘనముగా నిర్వహించారు  . ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం లో ఏర్పాటు  చేసిన సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు  సొల్లు లక్ష్మి మాట్లాడుతూ టి అర్ స్ ప్రభుత్వం మంచి నీళ్ళు ఇవ్వకుండా ,విది విదినా  బెల్టు షాప్  లు పెట్టి దానిపై వచ్చే సొమ్ము చేకుర్చుకుంటుంది అని,  బడుగు బలహీన వర్గాల పేదలకు  3 ఎకరాల భూమి ఎ మాత్రం ఇవ్వకుండా, డబుల్ బెడ్ రూం ఇల్లు మండలంలో  40 మాత్రమే వచ్చాయని అని వాటిలో అవకతవకలు జరగకుండా పేదలకు ఇవ్వాలని   డ్వాక్ర మహిళల  ఋణం మాఫీ చేయాలనీ ,అన్నారు . ఈ కార్యక్రమంలో  మండల  ఉపాధ్యక్షులు సంగం  శ్రీను, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్,లూ కోత్వాల శ్రీనివాస్, ఎర్రం మహేష్,చందా నాగరాజు, ఆత్మకూరి నరేష్ లు  మరియు  పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు  

Tuesday, 29 March 2016

విచ్చల విడిగా సిమ్ లు అమ్మితే కఠిన చర్యలు - సి ఐ కరుణాకర్

విచ్చల విడిగా  సిమ్ లు అమ్మితే కఠిన చర్యలు - సి ఐ  కరుణాకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ద్రువికరణపత్రాలు సరిచూసిన తర్వాతే  సిమ్ లు అమ్మాలని,అలా కాకుండా దానికి విరుద్దంగా రోడ్లపై   గొడుగులు పెట్టి   విచ్చల విడిగా  అక్రమముగా సిమ్ లు అమ్మితే చట్ట రిత్య  కటిన చర్యలు తీసుకుంటామని తాండూర్ సి ఐ  కరుణాకర్ అన్నారు మంగళవారం సి ఐ కార్యాలయంలో   రిటైలర్ల  సమావేశం లో ఆయన మాట్లాడుతూ  సెల్ ఫోన్ వినియోగదారులకు కొత్తగా సిమ్ కార్డు జరిచేసేటపుడు ద్రువికరణ పత్రాలు వచ్చిన వ్యక్తి ఫోటో ఒర్జినల్ సరిచుసికొని వినియోగదారుని సంతకాలు తీసుకోని జరిచేయాలని అన్నారు . ద్రువికరణ పత్రాలు లేకుండా కొత్త వ్యక్తులు అనుమనవస్పదముగ ఆగిపించిన వారిని  దగ్గర వున్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనీ అన్నారు  ఈ సమజంలో ఎ   నేరం జరిగినా నేర పరిశోధన సిమ్ కార్డు నుంచి మొదలు అవుతుంది అవే  సిమ్  కార్డు లు విచ్చల విడిగా అమ్మడం వల్ల నేరం మరో కోణంలో వెళ్లి అసలైన నేరస్తులు తప్పించుకునే అవకాశాలు వున్నాయి అలాటప్పుడు సిమ్ కార్డు జారి చేసిన  రిటైలర్  కానీ  డిస్టుబుటర్  వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి పోర్జరీ,మరియు వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేస్తామని అన్నారు.  అందుచేత   తగు జాగ్రతలతో సిమ్ కార్డు అమ్మాలని సూచించారు .  ఈ కార్యక్రమంలో  రిటైలర్ల మండల  సంఘం అద్యక్షుడు సునీల్ కుమార్ , ఉపాధ్యక్షులు కరుణాకర్, ప్రధాన కార్యదర్శి మల్లేష్, రెబ్బెన ఐడియా డిస్టుబుటర్ లోకేష్ నాయుడు , ఎయిర్ టెల్ డిస్టుబుటర్ ఎమ్ . సతీష్ గౌడ్, ,వొడాఫోన్ డిస్టుబుటర్  అనిల్, గోలేటి ఐడియా డిస్టుబుటర్   మొఈస్, శంకర్,సాయి, మహేష్,  ముడెడ్ల రాజేందర్ మరియు  ఐడియా ఆఫీస్ ఇంచార్జి బి.రాజుకుమార్ గౌడ్ మరియు  రిటైలర్ లు పాల్గొన్నారు. 

టెలికాం మండల రిటైలర్ల కార్యవర్గ ఎన్నిక సమావేశం:

 టెలికాం మండల రిటైలర్ల కార్యవర్గ ఎన్నిక సమావేశం:


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండలంలో  అన్ని టెలికాం  కంపెనీల  రిటైలర్ల ,సేల్స్ నిర్వాహకుల  సమావేశం సోమవారం రామాలయం లో  నిర్వహించుకున్నారు.  ఈ సమావేశంలో రెబ్బనమండలంలోని కమిటీ కార్యవర్గ ఎన్నిక జరిగింది. అద్యక్షుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ అన్ని టెలికాం కంపనిలవారు రిటైలర్లను చిన్నచుపు చుస్తున్నారని, కంపనిల టార్గెట్ కోసం డిస్త్త్రిబ్యుటర్ల ఫై ఒత్తిడితెచ్చి ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా ప్రీపేడ్ కనెక్షన్లు అమ్మి రిటైలర్ల డెమోల నుండి పంపిస్తున్నారు.   అలాగే రిటైల్  గా అమ్మే వారు ద్రువికరణపత్రాలు సరిచూసిన తర్వాతే  సిమ్ లు అమ్మాలని నిర్ణఇంచుకున్నారు.  టెలికాం  కంపెనీలు ఇచ్చే 2%కమిషన్ పెంచాలని, అప్లికేషన్ ఫారంలోఉన్న రిటైలర్ కాలాన్ని తీసివేయాలని, పోస్ట్ పైడ్ ఆక్టివేషన్లు ఏ పద్ధతిలో కనెక్షన్లు ఇస్తున్నారో అదే పద్దతిలో   కంపెనీ ఉద్యోగి కస్టమర్ల ద్రువికరణపత్రాలు సరిచూసి ప్రీపేడ్ కొత్త కనెక్షన్లు ఇవ్వాలి .కానీ అన్ని టెలికాం  కంపెనీలు   దీనికి విరుద్దంగా రిటైలర్లఫై భారం మోపి ,ఇచ్చే 5 నుండి -10రూపాయల కమిషన్లకు రిటైలర్లను  నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు . దీనిపై కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.  తీసుకున్న కనెక్షన్లు వినియోగదారులు ఉపయోగించకుండా ఇతరులకు ఇవ్వడంవల్ల సిమ్ పోయినపుడు బ్లాక్ చేయకుండా వుంచడంవల్ల, సిమ్ దొరికిన  వ్యక్తి మిస్యూస్ చేయడంవల్ల కేసులు నమోదు చేసి పోలీసులు రిటైలర్లను అరెస్ట్ చేస్తున్నారు.  కావున మండల ప్రజలందరూ ఇతరుల ద్రువికరణ పత్రాలతో సిమ్ లను  తీసుకోరాదని అన్నారు  ఎన్నికైన కార్యవర్గం సబ్యులు అద్యక్షుడు సునీల్ కుమార్ , ఉపాధ్యక్షులు కరుణాకర్ , సంతోష్ చారి, ప్రధాన కార్యదర్శి మల్లేష్ , కోశాదికారి హరీష్ , సంయుక్త కార్యదర్శి దుర్గం ప్రవీణ్ కుమార్ లను మండలం లోని అందరు రిటైలర్ లు కలిసి ఎన్నుకోవటం జరిగింది.  కమిటి సబ్యులు లఖన్  జైస్వాల్, భీమేశ్ , తిరుపతి , నరేష్, సతీష్. సలహాదారులు లోకేష్, సతీష్ గౌడ్, శంకర్, అనిల్, మొఈస్, రిటైలర్ల నరేష్,హరీష్ ,ఆజయ్  జైస్వాల్, పవన్, సంతోష్ లు పాల్గొన్నారు  

Saturday, 26 March 2016

కళా జాత భ్రుందాల చే అవగాహన

కళా  జాత భ్రుందాల చే అవగాహన


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభుత్వ సంక్షేమా పథకాలపై  తెలంగాణా ప్రభుత్వం సమాచార పౌర సంభందాల శాఖ ఆదిలాబాద్ ఆధ్వర్యములో  రెబ్బెన మండల కేంద్రములో తెలంగాణా సాంస్కృతిక సారది కలాజత భ్రున్దాలచే అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా వారు ఆటా పాటలు పాడుతూ ప్రదర్శన ఇచ్చ్చారు . ఈ కార్య క్రమములో కళాకారులు కొప్పర్తి సురేందర్ , గోదిశేల బాపు , కొద్ది సోమశేఖర్ , గోదిశేల కృష్ణ , ఎం డి ఇర్ఫాన్ , కొప్పర్తి రవీందర్ , గుండా శిరీష , కట్ల అపూర్వ లు ఉన్నా

అక్రమంగా తరలిస్తున్నా ఇసుక పట్టివేత

అక్రమంగా తరలిస్తున్నా ఇసుక పట్టివేత 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);;  రెబ్బెన మండలములోని గంగాపూర్  వగు నుండి అక్రమంగా తరలిస్తున్నా  మూడు ఇసుక ట్రాక్టర్లను శనివారము పట్టుకున్నారు . అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారాన్ని తెలుసు కున్నా తహసిల్దార్ రమేష్ గౌడ్ మరియు ఎస్.ఐ దారం సురేష్ గంగాపూర్ వాగు  మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నాటు తెలిపారు తహసిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ  గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ  వెంకటేశ్వరస్వామి దేవస్తాన ప్రాంగణంలో గల వాగు నుంచి  ఇసుక రవాణా చేయకూడదని అంగీకర పత్రాలు వున్నా ఇసుకను తియరాదని, తీసినచొ కటిన చర్యలు తీసుకుంటామని అన్నారు 

కాంట్రాక్ట్ కార్మికుల ను పర్మినెంట్ చేయాలని పోస్తల్ల విడుదల

కాంట్రాక్ట్ కార్మికుల ను పర్మినెంట్ చేయాలని పోస్తల్ల విడుదల 

(రెబ్బెన వుదయం ప్రతినిధి) ముఖ్య మంత్రి కె సి ఆర్ ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని శుక్ర వారము పోస్టర్లను విడుదల శేశారు .అనంతరం బత్తుల వెంకటేష్  మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్య మంత్రి  ఎన్నికలకు ముందు ఇచ్చే న  వాగ్దానాలను నెరవేర్చా కుండా  కాంట్రాక్ట్ కార్మికుల మిద చిన్న చూపు చూస్తునట్లు తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికులను తమ ప్రభుత్వం అద్వార్యంలోనే పర్మినెంట్ చేస్తానని చెప్పి అట్టి వాగ్దానాన్ని విస్మరించారని  అన్నారు  ఈ  కార్యక్రమంలో బండారు  తిరుపతి ,చంద్రయ్య ,అంఖుబై ,రాణి ,పోషం,నారాయణ,శ్రీనివాస్లు  పాల్గున్నారు


చలి వెంద్రాన్ని ప్రారంబించిని ఎం ఎల్ ఎ కోవ లక్ష్మి

చలి వెంద్రాన్ని ప్రారంబించిని ఎం ఎల్ ఎ కోవ  లక్ష్మి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలమ్ కాగజ్ నగర్ ఎక్ష్ రోడ్ లోరెబ్బెన తహసిల్దార్ బండారు రమేష్ గౌడ్ తన  కుమారుడు  ఫణి కుమార్ స్మారకార్థం గా ఏర్పాటు చేసిన   చలి వెంద్రాన్ని శుక్ర వారము  ఆసిఫాబాద్ ఎం ఎల్ ఎ కోవ  లక్ష్మి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి చలి వెండ్రాల ఏర్పాటుతో ఎంతో మంది దాహార్తి తీర్చిన వారము అవుతామని అన్నారు . ఫణి కుమార్ పేరుతో చేసే సేవ కార్య క్రమాలు అతని ఆత్మకు శాంతి ని చేకురుస్తాయని ఆమె తహసిల్దార్ ను కొనియాడారు . ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు ,కొండ పెళ్లి సర్పంచ్ మానతు మేర ,రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,  టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి ,  జిల్లా ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్ , తూర్పు జిల్లా అధ్యక్షుడు నవీన్ జైస్వాల్ , టి డి పి  మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్ , ఆసిఫాబాద్ సర్పంచుల సంగం అధ్యక్షుడు కిష్టయ్య ,చిరంజీవి గౌడ్ తడి తరులు పాల్గొన్నారు .

Thursday, 24 March 2016

బి సి హాస్టల్లో వాచ్ మెనే వార్డన్ గా విధులు....

 బి సి హాస్టల్లో వాచ్ మెనే   వార్డన్ గా విధులు....  

వార్డెన్ లేకపోవడంతో  ఇంటి దారి పట్టిన విద్యార్థులు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి)

 రెబ్బెన మండల కేంద్రంలోని వెనుకబడు తరుగతుల వసతి గృహం రోజు రోజుకి అస్త వ్యస్తంగా మారుతుంది.  .విద్యార్థుల బాగోగులు వసతులు చుస్కోవాల్సిన సంక్షేమ అధికారి నిర్లక్షమే ఇందుకు ప్రత్యేక సాక్ష్యం .ప్రదానంగా వెనుకబడు విద్యార్థులకు వసతి తోపాటు విద్యబోదన, పౌష్టికాహారం అందించాల్సిన సంక్షేమ అధికారి నిర్లక్షమే విద్యార్థులు పాలిట శాపంగా మారింది. మండలంలో  ఉన్న బి సి హాస్టల్ లో  కాలం చెల్లి పోయిన ఆహార వస్తు సామగ్రి తో విద్యార్థులకు భోజనం పెడుతున్నారని, దీనితో అనారోగ్యం పాలు అవుతున్నారని   మండల వాసులు చెబుతున్నారు.  గురువారం ప్రత్యేకంగా ప్రసార మరియ ప్రచార మాధ్యమాలు హాస్టల్ కి వెళ్ళగా నివ్వురు పరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి . హాస్టల్ వార్డెన్ గత కొన్ని రోజుల నుండి హాస్టల్ కి రావడం లేదని సరిపడు వంట సామాగ్రి నిల్వలు లేవని వాచ్మెన్ తో పాటు విద్యార్థులు తెలిపారు. హాస్టల్ లో 35 మంది విద్యార్థులు ఉండగా కేవలం 7 గురు విద్యర్హులు మాత్రమే ఉన్నారు. వీరు  10వ తరగతి విద్యార్థులే. ఉన్న ఏడుగురు విద్యార్తులకు కూడా మేను ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు తెలిపారు వార్డెన్ లేక  పోవడం తో వాచ్ మెన్ సర్వ విదులను నిర్వహిస్తున్నాడు.దీంతో విద్యార్థులు అసౌకర్యాల లేమితో ఇంటి దారి పట్టారు . అధికారుల నిర్లక్షం తో రాబోవు సంవత్సరం  పూర్తిగా హాస్టల్ మూతబడే ప్రమాదం ఉందని తల్లి దండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం వసతి గృహాలలో పదోతరగతి విద్యార్థులు కొరకై రాత్రి వేళ్ళల్లో ప్రత్యక విద్య బోదకున్ని నియమించినప్పటికీ రావడం లేదని విద్యార్థులు తెలిపారు. హాస్టల్ల్లో ఉన్న  అసౌకర్యా లను విద్యార్థులు వెల్లడిస్తే వారిపై కక్ష్య సాదింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టా త్మకంగా చేపట్టిన వసతి గృహాల నిర్వహణ  అధికారుల నిర్లక్షంతో వార్డెన్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు దర్పణంలో  కనిపిస్తుంది.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ నిర్వహణ తీరు పై ద్రుష్టి సారిస్తే మెరుగుపడే అవకాశం ఉన్నదని ప్రజలు అంటున్నారు .

90 కోట్ల తో ప్రాణహిత చేవెళ్ళ పై బ్రిడ్జి నిర్మాణం

90 కోట్ల తో ప్రాణహిత చేవెళ్ళ పై బ్రిడ్జి నిర్మాణం 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) సిర్పూర్ నియోజక వర్గం బెజ్జురు మండలం లోని గూడెం వద్ద తెలంగాణా ప్రభుత్వం 90 కోట్ల వ్యయం తో ప్రజల సౌకర్యార్ధం బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు సిర్పూర్  ఎం ఎల్ ఎ కోనేరు కోనప్ప గురువారం వికేకర్ల సమావేశం లో తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజల ముఖ్యమైన   అవసరాలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు . ఈ బ్రిడ్జి నిర్మాణం తో మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,చత్తీష్ ఘాట్ కు ,రవాణా సౌకర్యాలతో పాటు  సంభంద  బాందవ్యాలు మెరుగుపడుతాయని  అన్నారు . సిర్పూర్ నియోజకం,ఆసిఫాబాద్ ,నియోజక,బెల్లంపల్లి నియోజక వర్గాల  ప్రజలకు రావాన , వాణిజ్య,వస్తు మార్పిడి కార్యకలాపాలు పెద్ద మొత్తం లో జరుగుతయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చోరువతో ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు.  

రంగుల రంగులతో హొలీ పండగ

రంగుల రంగులతో హొలీ పండగ 


రెబ్బెన మండలం లో రంగుల పండుగను ఆనందోత్సవాల తో బుధవారం జరుపుకొన్నారు . ఉదయము నుండే  పిల్లలు , పెద్దలు తారతమ్యము లేకుండా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషాన్ని వేలిబుచారు . ప్రధాన వీదుల గుండా తిరుగుతు కోలాటాలు , డ్యాన్సులు చేశారు . సాయంత్రము వరకు పార్టీలతో , పబ్బులతో గడిపారు . 
 . 



విరిగిన విద్యుత్ స్తంభం -భయము గుప్పిట్లో ప్రజలు

విరిగిన విద్యుత్ స్తంభం -భయము గుప్పిట్లో ప్రజలు 


(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామం గుడి దగ్గర  ట్రాన్స్ ఫరముథొ కూడిన విద్యుత్ స్తంభము విరిగిపోయి ఉన్నది . ఆ విద్యుత్ స్తంభము ఎప్పుడు విరిగి పోతుందో , ఎప్పుడు ఎ ప్రమాదము ముంచుకొస్తుందో నని ప్రజలు భయా భ్రాన్తులకు గురి అవుతున్నారు . మంగళ వారం సాయంత్రము  ఇందిరా నగర్ లో  గల బెల్లపు ఒర్రె దగ్గర విద్యుత్ అధికారుల నిర్లక్షం తో నిండు ప్రాణం విద్యుతఘతానికి బలైపోయింది.  ఆసిఫాబాద్ బూరుగూడ  నుండి  గొర్ల మందను రెబ్బెన వైపుకు తీసుకువస్తున్న  గొర్ల కాపరి కొండ పర్వతలు (45) సుమారు సాయంత్రం విద్యుతఘతానికి గురై మృతి చెందాడు. మృతుడు తాండూరు మండలం లోని  కాసిపేట కు చెందినవాడిగా బందువులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం మృతుడు కర్ణం బీరయ్య కు కులికి వచ్చాడని వాళ్ళు చెప్పారు.  గత పదిహేను రోజుల క్రితం వీచిన గాలి వానకి  విద్యుత్ తీగలు వ్రేలాడుతున్నట్లు స్తానికులు, రైతులు  వివరించారు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా వుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.గత 9 నెలల క్రితం సింగల్ గూడకు చెంది వృద్దురాలు విద్యుత్ కు ప్రాణాలు కోల్పోయిన సంగత న మరవక ముందే ఈ దారుణం జరిగింది .  ఈ విధుత్ స్తంభము విరిగిన , కరెంట్ తీగలు భూమి మీద ఉయాలలూగిన విధుత్ అధికార్లు పట్టించుకోవడము లేదనే ఆరోపణలు ఉన్నాయి . ఇది అధికార్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనబడుతున్నాడని మండల వాసులు అంటున్నారు . 

విద్యుత్ అధికారుల నిర్లక్షంతో గొర్ల కాపరి బలి

విద్యుత్ అధికారుల నిర్లక్షంతో గొర్ల కాపరి బలి 


(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి సమీపంలో గల బెల్లపు ఒర్రె దగ్గర విద్యుత్ అధికారుల నిర్లక్షం తో నిండు ప్రాణం విద్యుతఘతానికి బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే  ఆసిఫాబాద్ బూరుగూడ  నుండి  గొర్ల మందను రెబ్బెన వైపుకు తీసుకువస్తున్న  గొర్ల కాపరి కొండ పర్వతలు (45) సుమారు సాయంత్రం  గం.. 5.30 సమీపం లో  విద్యుతఘతానికి గురై మృతి చెందాడు. మృతుడు తాండూరు మండలం లోని  కాసిపేట కు చెందినవాడిగా బందువులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం మృతుడు కర్ణం బీరయ్య కు కులికి వచ్చాడని వాళ్ళు చెప్పారు.  గత పదిహేను రోజుల క్రితం వీచిన గాలి వానకి  విద్యుత్ తీగలు వ్రేలాడుతున్నట్లు స్తానికులు, రైతులు  వివరించారు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా వుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కాని అగ్ర కులాల వాళ్ళ చేతుల్లో రాజ్యం -

తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కాని అగ్ర కులాల వాళ్ళ చేతుల్లో రాజ్యం -

బి సి. ఐక్య సఘర్షణ సమితి జాతీయ అద్యక్షుడు వి జి అర్ నారగోని 




(రెబ్బెన వుదయం ప్రతినిధి)   తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కాని ఇప్పటికి రాష్ట్రము అగ్ర కులాల వాళ్ళ చేతుల్లోనే మగ్గుతుందని బి సి. ఐక్య సఘర్షణ సమితి జాతీయ అద్యక్షుడు వి జి అర్ నారగోని  అన్నారు.  బిసి ఐక్య సఘర్షణ సమితి ఆధ్యర్యంలో  ఎస్ సి , ఎస్ టి , బి సి , మైనారిటి రాజ్యాధికార చైతన్య సదస్సు  రెబ్బన అతిధి గృహంలో  సోమవారం నిర్వహించటం జరిగింది.  ప్రధాన రహాదారి గుండా భారి ర్యాలి నిర్వహించారు . అనతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు .  బిసి కులాల ఐక్యా సంఘర్షణ సమితి జిల్లా అద్యక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ అద్యక్షతన జరిగిన సభలో ముక్య అదితి గా విచ్చేసిన బి సి. ఐక్య సఘర్షణ సమితి జాతీయ అద్యక్షుడు వి జి అర్ నారగోని మాట్లాడుతూ అన్ని  బడుగు బలహీన వర్గాల త్యాగాల ఫలితం గా తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. కాని ఇప్పటికి రాష్ట్రము అగ్ర కులాల వాళ్ళ చేతుల్లోనే మగ్గుతుందని అన్నారు.     చట్టసభల్లో అవకాశాలు కల్పించాలాని ,  బి సి లకు రిజర్వేశండ్లు కల్పించాకపోవడంతో చాల వెనుకబడి పోయారని వారు పెర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేశన్లు అమలు చేయక పోవడమే కారణమని తెలిపారు. బి సి వారికి ఉద్యోగాల్లో ప్రమోశండ్లు కల్పిచాలని అన్నారు. వెనుకబడిన బి సి విద్యార్థులకు స్కాలర్ షిప్పులు విడుదల చేయాలి  అన్నారని తెలిపారు.  దేశవ్యాప్తంగా బి సి కులాలు సమస్యలు ఎదుర్కోటు న్నారని ముఖ్యంగా రాష్ట్రంలో బి సి కులాల వారు పేదరికంలోఉన్నారని  బి సి వారందరికీ కళ్యాణ లక్ష్మి పధకం అమలు చేయాలనీ,  3 ఎకరాలు భుమియియ్యాలి డిమాండ్ చేశారు .  ఈ కార్య క్రమంలో బిసి కులాల ఐక్యా సంఘర్షణ సమితి తెలంగాణా  రాష్ట్ర  అద్యక్షుడు  పెద్దంపేట. శంకర్, విధాన నిర్ణయ కమిటి విస్ చైర్మన్ మేకల మల్లేశం, రాష్ట్ర్ర నాయకులు బి సి ఐక్య సంఘర్షణ సమితి కదతల మల్లయ్య ,  జిల్లా  కార్యదర్శి పులబోయిన మొండయ్య ,   జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి కొవ్వూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రమేష్   ఎం పి పి సంజీవ్ కుమార్, జెడ్పి టిసి బాబురావు, జిల్లా జిల్లా మహిళా అద్యకురాలు కుందారపు శంకరమ్మ, తూర్పు జిల్లా అద్యక్షుడు  నవీన్ జైస్వాల్  తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ఉద్యమ కారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడుగా బోగే ఉపేందర్

తెలంగాణ  ఉద్యమ కారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడుగా  బోగే ఉపేందర్ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  తెలంగాణ ఉద్యమ ఉద్యమ కారుల సంఘం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బెన మండలం  గోలేటి గ్రామానికి చెందినా బోగే ఉపేందర్ ను నియమించినట్లు అ సంఘం జిల్లా అధ్యక్షుడు వహాబ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్బముగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధనలో ఉద్యమ కారుల పాత్ర మరువ లేనిది అని అన్నారు అలాగే 2009 సం లో అప్పటి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణచి వేసేందుకు అక్రమ కేసులు పెట్టిందని దాని వలన ఉద్యమ కారుల ఆర్దికముగా మానసికముగా ఉద్యోగ అవకాశాలు రాక తీవ్రముగా నష్ట పోయారని, ఇప్పటికి అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర యోదులుగా గుర్తిచాలని, అలాగే ఉద్యోగం ఇవ్వాలని, పెన్షన్ లు ఇవ్వాలని, అర్హులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మరియు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని ప్రబుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తా అని అన్నారు

గిరిజన యునివర్సిటిపై అసెంబ్లీ లో స్పందించని మంత్రులు

గిరిజన  యునివర్సిటిపై అసెంబ్లీ లో స్పందించని మంత్రులు 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి): జిల్లాలో గిరిజన యునివర్సిటిపై జిల్లా ఎం ల్ ఎ ,ఎం పి ,ఎమ్ ల్ సి ,మంత్రులు స్పష్టత ఇవ్వాలని ఎ ఐ ఎస్ ఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు రెబ్బెన మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కొమురం భీం వర్ధంతి  9 అక్టోబర్ 2014 సం.. గిరిజన దర్భార్ లో వెలది ప్రజలతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయానికి కొమరం భీం పేరు పెడుతూ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆదిలాబాద్ జిల్లా లో ఏర్పాటు చేస్తానని  ముఖ్యమంత్రి కే సి ఆర్  హామీ ఇచ్చారు కానీ  గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉట్నూర్ లో ఏర్పాటు చేయకుండా వరంగల్ కు తరలిస్తున్నారని దీనిని తీవ్రముగా కండి స్తున్నామని అన్నారు అక్షారస్యతలో వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్, అలంటి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు  ఎం ల్ ఎ ,ఎం పి ,ఎమ్ ల్ సి స్పందిచక పోవడం సిగ్గు చేటు అన్నారు అసెంబ్లీ సమావేశాలలో గిరిజన యునివర్సిటిపై చర్చ రక పోవడం దారుణము అన్నారు ఇప్పటికీ అయిన అసెంబ్లీ సమావేశాలో చర్చించి ఉట్నూర్ లో ఏర్పాటు చేయాలనీ అన్నారు లేని పక్షం లో అసెంబ్లీ సమావేశాలు మిగియక ముందే చలో హైదరబాద్ కార్యక్రమం చేపడతామని, అప్పటికి స్పందిచక పోతే ఇంద్ర పార్కు ముందు ధర్నా నిర్విస్తామని, అప్పటికి స్పందించక పోతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని,దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు  ఉద్యమాన్ని దశలవారీగా ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో   ఎ ఐ ఎస్ ఫ్ మండల అధ్యక్షుడు కస్తూరి రవి, బోగే ఉపేందర్, ప్రదీప్, మహిపాల్ , తిరుపతి ,పుదరి సాయి కిరణ్ మరియు  పలువురు విద్యార్ధి సంఘ నాయకులు  పలుగున్నారు

బెల్లంపల్లి ఏరియాలో లక్ష్యాన్ని దాటినా బొగ్గు ఉత్పత్తి- జియం రవిశెంకర్

బెల్లంపల్లి ఏరియాలో లక్ష్యాన్ని దాటినా బొగ్గు ఉత్పత్తి- జియం  రవిశెంకర్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం  గోలేటి లోని  బెల్లంపల్లి ఏ రియాకు నిర్దేశించిన 62.60 లక్ష ల టన్నుల బొగ్గు ఉత్పతి లక్ష్యాలను తేది 20-03-16 నాటికీ సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశెంకర్ ఒక ప్రకటనలో తెలిపారు 2015-16లో 100 % బొగ్గు ఉత్పత్తి  ముందుగానే సాధించడానికి కృషి చేసిన కార్మికులు సుపరవైజర్లు మరియు అధికారులకు ఈ సందర్బంగా శుబాకాం క్షా లు తెలిపారు ఈ ఉత్పత్తిని సాధించడానికి తమవంతు సహకారం మరియు తోడ్పాటును అందించిన ట్రేడ్ యూనియన్ నాయకులందరిని క్రుతజ్ఞతాబివంధనములు తెలియజేసారు ఇదేక్రమంలో బెల్లంపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున సంక్షేమకార్యక్రమాలు కూ డా చేపటడం జరిగిందని తెలియజేశారు బవిష్యత్ లో కూ డా కార్మికులు మరియు అధికారులు కలిసి పనిచేస్తూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఈ సంధర్బంగా వారు కోరారు

REBBENA MANDALLO POLICE VECHILE TANIKHILU COVER ON T NEWS


Tuesday, 22 March 2016

విద్యుత్ అధికారుల నిర్లక్షంతో గొర్ల కాపరి బలి

విద్యుత్ అధికారుల నిర్లక్షంతో గొర్ల కాపరి బలి 




(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి సమీపంలో గల బెల్లపు ఒర్రె దగ్గర విద్యుత్ అధికారుల నిర్లక్షం తో నిండు ప్రాణం విద్యుతఘతానికి బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే  ఆసిఫాబాద్ బూరుగూడ  నుండి  గొర్ల మందను రెబ్బెన వైపుకు తీసుకువస్తున్న  గొర్ల కాపరి కొండ పర్వతలు (45) సుమారు సాయంత్రం  గం.. 5.30 సమీపం లో  విద్యుతఘతానికి గురై మృతి చెందాడు. మృతుడు తాండూరు మండలం లోని  కాసిపేట కు చెందినవాడిగా బందువులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం మృతుడు కర్ణం బీరయ్య కు కులికి వచ్చాడని వాళ్ళు చెప్పారు.  గత పదిహేను రోజుల క్రితం వీచిన గాలి వానకి  విద్యుత్ తీగలు వ్రేలాడుతున్నట్లు స్తానికులు, రైతులు  వివరించారు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా వుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. 

Monday, 21 March 2016

ఎన్ ఓ ఐ ఎస్ పరిక్షలు ప్రశాంతం

ఎన్ ఓ ఐ ఎస్ పరిక్షలు ప్రశాంతం 


రెబ్బెన:  (వుదయం ప్రతినిధి) మండల కేంద్రములో ని 19 కేంద్రాలలో నిర్వహించిన ఎన్ ఐ ఓ ఎస్ పరిక్షలు ఆదివారము ప్రశాంతంగా జరిగాయి . గోలేతిలో ని కేంద్రములో 105 మంది , రెబ్బెనలో 55 మంది , మిగతా కేంద్రాలలోను వయోజనులు పరీక్షలు రాశారని మండల పర్య వేక్ష అధికార్లు రాజ్ కుమార్ , ఎ పి  ఓ కల్పనా , డిప్యూటి తహసిల్దార్ రామ్ మోహన్ రావు  తెలిపారు . మండలములో మొత్తం వయోజనులు  పరిక్షలు రాశారు . 

సమావేశ సమయం మారిన సమాచారమివ్వని- ఎం. పి . డి. ఓ


సమావేశ సమయం మారిన సమాచారమివ్వని ఎం పి  డి ఓ

రెబ్బెన సర్వ సభ్య సమావేశము ఆదివారము ఉదయం 11.30ని "జరగాల్సి ఉండగా మధ్యాహ్నానికి వాయిదా వేశారు . ఆ సమాచారం కొందరికె ఎం.పి.డి.ఓ  తెలిపారు . కనీసము పత్రిక విలేకర్లకు తెలుపకపోవడము ఎంత విద్దురమని సభ్యులు , అధికార్లు అంటున్నారు . ఎం.పి.డి.ఓ ఓ కార్యాలయానికి ఉదయము 11.  30 నిమిషాలకు  కొందరు  పత్రిక విలేకర్లు వెళ్లి కార్యాలయా సిబ్బందిని సమావేశము ఎప్పుడని అడుగగా వాయిదా పడ్డట్లు తెలుపడముతో  విలేకర్లు కంగు తిన్నారు . ఈ విషయము ఎం.పి.డి.ఓ అలీమ్ కు ఫోన్లో  సంప్రదించగా ఏమీ స్పందించా లేదు . మండలము లో అభివృద్ధి పనులు ప్రభుత్వ పరంగా ఎన్నో గరుతున్న ఎం పి  డి ఓ మాత్రము ఎలాంటి సమాచారము ఇవ్వడము లేదు . ప్రభుత్వమ్  చేపట్టిన స్ప్రజా సంక్షేమ పతకాలు  ప్రజలకు తెలియ జేయాల్సిన ఎం పి  డి ఓ పత్రిక ముఖంగా తెలుపక పోవడముతో ప్రభుత్వ పతకాలు ప్రజలకు తెలియడము లేదని విలేకర్లతో పాటు మండల ప్రజలు అంటున్నారు .  

సర్వ సభ్య సమావేశం వాయిదా


సర్వ సభ్య సమావేశం వాయిదా



రెబ్బెన:  (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల ప్రజా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం ఆదివారం నిర్వహించాల్సి ఉండగా అధికారులు, సభ్యుల కోరం  లేక   సమావేశం వాయిదా పడింది. ఈ సర్వ సభ సమావేశాన్ని తిరిగి ఏప్రిల్ మాసము లో నిర్వహిస్తున్నట్లు ఎం.పి.డి. ఎం ఎ అలీమ్ తెలిపారు. ఈ సమావేశానికి ఎం పి పి  సంజీవ్ కుమార్ , ఎం పి  టి సి లు కొవ్వూరి శ్రీనివాస్ , మురళి బాయి,  వ్యవసాయ అధికారి మంజుల ,ఐ కె పి  ఎ పి  ఎం వెంకట రమణ  , అంగన్ వాడి సూపర్ వైజర్లు , వేతెనారి డాక్టర్ సాగర్ , పి  ఆర్  జె యి జగన్నాథ్ లు ఉన్నారు .

Saturday, 19 March 2016

సాక్షర భారత్‌ ఓపెన్‌ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి


సాక్షర భారత్‌ ఓపెన్‌ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి

రెబ్బెన:  (వుదయం ప్రతినిధి)సాక్షర భారత్‌ ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఎంసీఓ మండల సమన్వయకర్త గంధర్ల సాయి బాబా తెలిపారు. చదవడం, రాయడం వచ్చిన వారు పరీక్షలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.మండల పర్య  మండల వ్యాప్తంగా 19  కేంద్రాలలో 2621 మంది పరీక్షలు హాజరయ్యేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం

రెబ్బన మండలం  ఈ నెల 20 ఆదివారం రోజున మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరుగనున్నట్లు ఈ  కార్యాక్రమం లో పలు అబివృద్ది సంక్షేమల పై  సమావేశం కొనసాగుతుందని ఏమ్పిడివో ఎం ఏ అలీం పత్రిక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అధికారులు, నాయకులను,ప్రజలను సకాలంలో హాజరు కావాలని  ఈ సమావేశంలో మండల సర్వతోముఖాబివ్రుద్దికి పాటుపడే అంశాలపై సర్వ సభ్య సమావేశం ఉంటుందని ఏమ్పిడివో  అన్నారు.

10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

రెబ్బెన:  (వుదయం ప్రతినిధి)  సామవారం రోజు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి వేకటేశ్వర స్వామి  తెలిపారు.మండల కేంద్రములో 2 పరీక్షా  కేంద్రాలు ఒకటి గంగాపూర్ ఉన్నత పాతశాల , రెండవది రెబ్బెన ప్రభుత్వ పాటశాల లో ఉన్నాయని అన్నారు . గంగాపూర్ పరీక్షా కేంద్రములో 167   మంది , రెబ్బెన పరీక్షా కేంద్రములో 221 మంది విద్యార్థులు పరిక్షలు రాస్తున్నారని తెలిపారు . రెబ్బెన చీప్ సుపరెడేంట్ సాంబ మూర్తి డి.ఓ గా ఆర్ కె ప్రసాద్ , గంగాపూర్ లో చీప్ సుపరెడేంట్ ఎస్ రాము , డి ఓ గా మొగిలి , మురళి లు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు . పరీక్షా కేంద్రాలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు . అరగంట ముందే పరీక్షా కేంద్రాని రావాలని విద్యార్థులకు సూచించారు .    ఈపరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అరంగటకుముందే రావాలని సూచించారు

Thursday, 17 March 2016

ఫ్లై ఓవర్ లేక స్థానికుల కష్టాలు మరియు ప్రయాణీకుల ఇబందులు

 ఫ్లై ఓవర్ లేక స్థానికుల కష్టాలు మరియు ప్రయాణీకుల ఇబందులు  
   రెబ్బెన:  (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో గల అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ (రెబ్బెన) నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్ లో ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ లేక స్టేషన్ వెనకాల ఉన్న కాలనివాసులు ( దాదాపు 200 మంది ) మరియు ప్రతి రోజు  ఈ స్టేషన్




నుండి రాకపోకలు జరుపే  ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .  అదే విధంగా అసిఫాబాద్ నియోజక వర్గానికి గల ఎకైక రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ నుండి రోజుకు దాదాపు 500ల మంది ప్రయాణికులు అసిఫాబాద్ ;వాంకిడి; కేరమెరి, జైనూరు ,రెబ్బెన మండలాల మరియు గోలేటి ; నంబాల ; గంగాపూర్ ;జక్కులపల్లి ;కొమురవెళ్ళి ; నార్లాపూర్  ; పున్జుమేరగూడ ;సింగల్ గూడ ; కొడపల్లి ; వాంకిడి ; కెరమెరి  గ్రామాల ప్రజలు ఈ  స్టేషన్ నుండి రాకపోకలు సాగిస్తున్నారు . నిజాం కాలం నాటి ఈ  రైల్వే స్టేషన్ దాదాపు 50 సం,, రాల  అసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ ఈప్పటికీ ఎ  అబివృద్దికి నోచుకోలేదు మురుగుదోడ్లు;మూత్రశాలలు;విశ్రాంతి గదులు;త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని  ప్రయాణికులు కోరుతున్నారు. ఈప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు  అధికారులు మారినా

స్టేషన్  పరిసరాలు  మారని వైనం . ఈ స్టేషన్ నుండి ప్రతి రోజు కాజీపేట నుండి బలార్ష వైపు 3 ట్రైన్స్ మరియు  సికింద్రాబాద్ నుండి సిర్పూర్-కాగజ్ నగర్  వైపు 2 ట్రైన్స్ వెల్తునాయ్ . వ్ర్రుద్దులు  ; మహిళలు ; పిల్లలు;వికలాంగులు ఫ్లాట్ ఫాం 1 నుండి ఫ్లాట్ ఫాం 2 వైపు వెళ్ళడానికి ఈబ్బందీగా వుంది . అపుడప్పుడు గూడ్స్ రైలు మధ్యలో ఆగివున్న గూడ్స్ రైలు కిందనుండి దాటి 2వ ఫ్లాట్ ఫాంకు వెళ్ళడానికి ఈబ్బందిగా వుందని విద్యార్థి ఆరిఫ్ అలీ మరియు ప్రయాణికులు వాపోయారు .   అదే విధంగా తెలంగాణ ముద్దు నల్ల బంగారం  బొగ్గు గని (గోలేటి ; కైరిగూడ గని)లో వేలాది మంది కార్మికులు;గని ఉన్నతాదికారులు ఉద్యోగ అవసరాలకు ఈ రైలు మార్గానే ఉపయోగిస్తారు. అదే విధంగా ఈ రైల్వే స్టేషన్లో మరి కొన్ని రైళ్ళు ( తెలంగాణ ;ఏపి;జెనతా)ఆపాలని గని కార్మికులు; ప్రయాణికులు మరియు స్తానికులైన  గొగ్గర్ల ప్రవీణ్ కూమార్; రమేష్; జి.హరి క్రిష్ణ; క్రాంతి; బైరి.రాజ్ కుమార్ గౌడ్, ముడేడ్ల శ్రీనివాస్  యువజన గౌడ సంగం జిల్లా కోశాదికారి  కొయ్యడ రాజ గౌడ్; తెరాస మండల మైనారిటి అద్యక్షుల్లు అన్వర్ భాయ్ లు కోరారు.

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు -తహశిల్దార్


అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు -తహశిల్దార్

రెబ్బెన:  (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలో తహసిల్దార్ బుధవారం ఏర్పాటు చేసిన సమవేశంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు రాత్రి వేళలో ఇసుక రవాణా చేయరాదని టాక్టర్ యజమానులు లెబార్ అధికారుల దగ్గర అంగీకర పత్రమను, అర్.టి.ఒ ఆఫీసు నుంచి అంగీకర పత్రమును తీసుకోవాలని అన్నారు బుగర్బ జలాలు అడుగంటకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద వుంటుంది అని అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ,పత్రాలు లేని ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన వారికీ కఠిన చర్యలు లతో పాటు జరిమాన విదిస్తామని అన్నారు 

సకాలంలో సరుకులు పంపిణి చేయాలి

సకాలంలో సరుకులు పంపిణి చేయాలి 


రెబ్బెన:  (వుదయం ప్రతినిధి)   రేషన్ డీలర్లు లబ్దిదారులకు సరైన సమయంలో సరుకులు పంపిణి చేయాలనీ రెబ్బెన తహశిల్దార్ రమేష్ గౌడ్ అన్నారు బుధవారం రోజున   రేషన్ డీలర్లు సమావేశంలో మాట్లాడాతు   రేషన్‌షాపులు వేళకు తెరచుకునేలా, సక్రమంగా సరుకులు పంపిణి జరిగేలా, సరైన వేళల్లో షాపు తెరవలేదని, డిడిలు సకాలంలో కట్టలేదని, కార్డుదారుల పట్ల కఠినంగా వ్యవహరించరాదని , లబ్దిదారులు నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు ఈ సమావేశంలో రెబ్బెన డీలర్లు రామయ్య, బాపు ,రాజేశ్వరి, తిరుపతి,శంకర్ లాల్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు

Tuesday, 15 March 2016

పాటశాల భవనాలకు పగుళ్ళు

పాటశాల  భవనాలకు పగుళ్ళు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలములో ని ప్రభుత్వ పాటశాలలకు మంజురైన నూతన భవనాలకు పగుళ్ళు తేలుతున్నాయి . ప్రభుత్వ అధికార్ల నిర్లక్ష్యానికి , కాంట్రాక్టర్ల దోపిడీ తనానికి ఈ పగుళ్ళు అద్దం  పడుతున్నాయి . గోలేటి గ్రామ పంచాయతి లోని రేకుల గూదేములోని  పాటశాల భవన నిర్మాణం లో నాణ్యత లోపించడం వలన పాటశాల భవనం భీటలు భారిందని సోమవారం రోజున ప్రజా పిరియదుల విభాగం లో ఉన్నటువంటి అధికారి  ఈ.ఓ.పి.ఆర్.డి కి వినతిపత్రం ఇస్తు ఆరోపించారు.   సంబందిత  కంట్రాక్టర్ లోపం వలన భవనం లో నాణ్యత లోపించడం కారణంగా భవనం పగుళ్ళు తేలి ప్రమాదకరంగా మారింది. క్వాలిటి లోపించడముతో పాటశాల భవనాలు ఎప్పుడు కూలి పోతాయో అని విద్యార్థుల  తల్లి దండ్రుల ఆరోపిస్తున్నారు .  కనీసం భవనంకు నీళ్ళు కూడా పోయకపోవడంతో నూతనంగా నిర్మించిన భవనం చాల ప్రమాదంగా  మారిందని గ్రామస్తులు ఏ. శ్రీనివాస్, బి. రాజు, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, పోచం, హరిదాస్, లింగయ్య, సురేష్, భాబురావు, భీంరావు తదితరలు పేర్కొన్నారు